‘మైత్రి’ బంధంలో విభేదాలు? నిజమేనా..!
విధాత: మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో ఇప్పుడు నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీ. స్టార్ హీరోలతో పాటు క్రేజీ హీరోలతో యంగ్ హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తోంది. 2017లో మహేష్ నటించిన శ్రీమంతుడు మూవీతో వీరి ప్రయాణం మొదలైంది. మొత్తం ముగ్గురు భాగస్వాములు. నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి. ఈ ముగ్గురితో పాటు చెర్రీ సీఈవోగా వ్యవహరించారు. ఈ ముగ్గురు కలిసి శ్రీమంతుడు నుంచి నాని గ్యాంగ్ లీడర్ వరకు ప్రయాణం చేశారు. ఉప్పెన […]

విధాత: మైత్రి మూవీ మేకర్స్ టాలీవుడ్‌లో ఇప్పుడు నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీ. స్టార్ హీరోలతో పాటు క్రేజీ హీరోలతో యంగ్ హీరోలతో వరుస సినిమాలు నిర్మిస్తోంది. 2017లో మహేష్ నటించిన శ్రీమంతుడు మూవీతో వీరి ప్రయాణం మొదలైంది. మొత్తం ముగ్గురు భాగస్వాములు.
నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి. ఈ ముగ్గురితో పాటు చెర్రీ సీఈవోగా వ్యవహరించారు. ఈ ముగ్గురు కలిసి శ్రీమంతుడు నుంచి నాని గ్యాంగ్ లీడర్ వరకు ప్రయాణం చేశారు.
ఉప్పెన నుంచి మోహన్ చెరుకూరి మైత్రి నిర్మాణ భాగస్వామి బాధ్యతలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పటి నుంచి నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ మాత్రమే మైత్రి పై సినిమాలు నిర్మిస్తున్నారు.
దాంతో వారి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు మొదలయ్యాయి. దానికి బలం చేకూరుస్తూ మోహన్ చెరుకూరి మరో భాగస్వామిగా విజయేందర్ రెడ్డితో కలిసి వైరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని హీరోగా నాని30 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ మూవీ ప్రారంభోత్సవంలో ఎలమంచలి రవిశంకర్ కూడా కనిపించారు. దాంతో మైత్రి వారి మధ్య విభేదాలు ఏమీ లేవని క్లారిటీ వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు.
గతంలో ఇదే తరహాలో డివివి దానయ్య, జే భగవాన్, పుల్లారావులు నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. తరువాత కాలక్రమంలో డివివి దానయ్య బయటకు వచ్చేశారు. జే. భగవాన్, పుల్లారావులు విడివిడిగా నిర్మాతలుగా స్థిరపడ్డారు. ఇలా బిజినెస్‌లో జరగడం మామూలే. గతంలో కిషోర్ రాఠి, అచ్చిరెడ్డి విషయంలో కూడా ఇలాగే జరిగింది. కాబట్టి మైత్రి వారి మధ్య విభేదాలు అనేవి కేవలం పుకార్లేనని అంటున్నారు.