ఒకే భంగిమలో చాలా కష్టమనిపించింది: సమంత

విధాత‌: నటిగా సమంత స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ఒక్క రంగస్థలం చిత్రంలో ఆమె పోషించిన రామలక్ష్మి పాత్ర ప్రేక్షకులను కట్టి పడేసింది. అలాగే యూటర్న్, జాను, ఓ బేబీ, యశోద వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు మరోవైపు మయోసైటీస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే ఈమె కోలుకుంటుంది. ఇంతకాలం సామాజిక మాధ్యమాలలో ఎంతో యాక్టివ్ గా ఉన్న సమంత గ‌త‌ కొంతకాలంగా మాత్రం సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది. అనారోగ్యం కార‌ణంగానే […]

  • By: krs    latest    Jan 15, 2023 9:32 AM IST
ఒకే భంగిమలో చాలా కష్టమనిపించింది: సమంత

విధాత‌: నటిగా సమంత స్థాయి ఏంటో అందరికీ తెలుసు. ఒక్క రంగస్థలం చిత్రంలో ఆమె పోషించిన రామలక్ష్మి పాత్ర ప్రేక్షకులను కట్టి పడేసింది. అలాగే యూటర్న్, జాను, ఓ బేబీ, యశోద వంటి చిత్రాలలో నటించి మెప్పించింది. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు మరోవైపు మయోసైటీస్ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే ఈమె కోలుకుంటుంది. ఇంతకాలం సామాజిక మాధ్యమాలలో ఎంతో యాక్టివ్ గా ఉన్న సమంత గ‌త‌ కొంతకాలంగా మాత్రం సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటుంది. అనారోగ్యం కార‌ణంగానే ఇలా జ‌రిగింది.

కానీ మరలా ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో మునుపటి సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించిన కబుర్లు పంచుకుంటుంది. తాజాగా శాకుంత‌లం చిత్రంలో తనకు ఎదురైన ఓ సవాలు తెలియజేసింది. ఈ చిత్రంలో నటించడం చాలా కష్టం అనిపించింది. ఆ పాత్ర స్వభావానికి తగ్గట్లు ముఖంలో హావభావాలు ఒకేలా పలికించడం, ఒకే భంగిమలో ఉండడం కష్టంగా అనిపించినట్టు చెప్పింది. అభిజ్ఞాన శాకుంత‌లం క‌థ‌ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకుడు. ఆయన నిర్మాణం భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. పౌరాణిక చిత్రం కావడంతో ఈ చిత్రంలో శాకుంతలం పాత్రకు తగ్గట్టుగా సమంత నటించాల్సి వచ్చింది. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు ఆఖరికి ఏడ్చేటప్పుడు కూడా ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఒకేలా పెట్టాల్సి వచ్చింది.

అలాగే ఒకే భంగిమలో కొనసాగాల్సి వచ్చింది. అలా కొనసాగించడం నావల్ల కాలేదు. ఎంతో కష్టపడ్డాను. దానికోసం ఎంతో శిక్షణ తీసుకున్నాను.. అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోతో పాటు శాకుంతలం భంగిమలో ఉన్న ఫోటోను నెటిజెన్లతో ఆమె పంచుకోంది. ఇటీవలే ఆమె ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసింది. ఇంట్లో నుంచి డబ్బింగ్ చెప్పి తన కమిట్మెంట్ చాటింది. ఒకప్పుడు సమంతాకు చిన్మయి డబ్బింగ్ చెప్పేది. కానీ ప్రస్తుతం మాత్రం సమంత తన చిత్రాలలో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది.

కాగా శాకుంతలం చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. యశోద చిత్రం తర్వాత వస్తున్న మూవీ కావడంతో, మ‌రోవైపు రుద్ర‌మ‌దేవి వంటి చిత్రం త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ ఎంతో డ‌బ్బు, శ్ర‌మ‌తో క‌ష్ట‌ప‌డి తీస్తున్న శాకుంతలంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందునా ఈ చిత్రం వివిధ భాషల్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

సమంత ఇప్పటివరకు నటించిన చిత్రాలలో ఇదే అత్యంత భారీ చిత్రమని చెప్పవచ్చు. మ‌రో వైపు ఈ మూవీకి దిల్ రాజు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొదువా అన్న‌ట్లు దిల్ రాజు చిత్రం కాబ‌ట్టి విడుద‌ల‌, ప్ర‌మోష‌న్లు, థియేట‌ర్ల విషయంలో ఈయ‌న‌కు ఢోకా లేదు. అది శాకుంత‌లం మూవీకి క‌లిసిరానుంది.