కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేసులోకి దిగ్విజయ్ సింగ్..!
విధాత: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో రోజుకో పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్.. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. ఆయనే దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్ సీఎంగా పని చేసిన దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు షికారు […]

విధాత: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంలో రోజుకో పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్.. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. ఆయనే దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్ సీఎంగా పని చేసిన దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో ఉన్న దిగ్విజయ్.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
గురువారం లేదా శుక్రవారం అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. రోజుకో పరిణామం చోటు చేసుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.