సీఎం కేసీఆర్ పాదాలు మొక్కిన హెల్త్ డైరెక్టర్..
ప్రసన్నం కావాలంటే ఆ మాత్రం చేయాలి మరి! విధాత: కోరుకున్న కోర్కెలు తీరాలంటే.. భక్తులు తమ ఇష్టదైవానికి సాష్టాంగదండాలు పెట్టి, తగిన కానుకగా ధనమో, బంగారమో హుండీలో వేస్తుంటారు. మరి అధికార గణంలో పదవులు దక్కాలంటే ప్రభు భక్తి అవసరం. దేవున్ని అయితే.. ఎప్పుడంటే అప్పుడు కొంత సమయం కేటాయిస్తే.. దర్శనం చేసుకోవటం కష్టం కాదు. కానీ అధికార పీఠంపై ఉన్న ప్రభువు దర్శన భాగ్యం అంత సులువు కాదు. ఆయనను ప్రసన్నం చేసుకోవటం ఇంకా కష్టం. […]

ప్రసన్నం కావాలంటే ఆ మాత్రం చేయాలి మరి!
విధాత: కోరుకున్న కోర్కెలు తీరాలంటే.. భక్తులు తమ ఇష్టదైవానికి సాష్టాంగదండాలు పెట్టి, తగిన కానుకగా ధనమో, బంగారమో హుండీలో వేస్తుంటారు. మరి అధికార గణంలో పదవులు దక్కాలంటే ప్రభు భక్తి అవసరం. దేవున్ని అయితే.. ఎప్పుడంటే అప్పుడు కొంత సమయం కేటాయిస్తే.. దర్శనం చేసుకోవటం కష్టం కాదు.
కానీ అధికార పీఠంపై ఉన్న ప్రభువు దర్శన భాగ్యం అంత సులువు కాదు. ఆయనను ప్రసన్నం చేసుకోవటం ఇంకా కష్టం. అలాంటి అవకాశం ఎప్పుడైనా, ఎక్కడైనా వస్తే అదే మహదావకాశంగా భావిస్తారు. పరిసరాలను, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఏలికల పాదాలను తాకి తన్మయత్వం పొందుతారు.
పాలకుల పట్ల ఉద్యోగులకు గౌరవ మర్యాదలు ఉండటంలో తప్పులేదు. కానీ మొన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎనిమిది మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎం కేసీఆర్ పాదాలకు మొక్కిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఇంతగా ఆయన కేసీఆర్ మెప్పు పొందటానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకోసమోనని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన స్వస్థలం నుంచి ప్రజాప్రతినిధిగా అవకాశం కోసం ఆరాటపడుతున్నాడు అనటానికి నిదర్శనమని చెవులు కొరుక్కుంటున్నారు. గతంలోను శ్రీనివాస రావు క్షుద్ర పూజలు చేసి వార్తలల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా రాజకీయాల కోసమే పూజలు చేశారని పుకార్లు వ్యాపించాయి.