పెద్దపల్లి BJPలో భగ్గుమన్న అసమ్మతి.. సమావేశమైన అసమ్మతి నేతలు
అధ్యక్షుని ప్రకటన వెలువడిన వెంటనే అసమ్మతి ఏడాది కాలంగా జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ సమర్థ నాయకత్వం లేకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలని ప్రశ్న పెద్దపల్లిలో సమావేశమైన BJP అసమ్మతి నేతలు విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి BJPలో అసమ్మతి భగ్గుమంది. పార్టీ జిల్లా అధ్యక్షునిగా రావుల రాజేందర్ నియామకాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా అధ్యక్షుని నియామక ప్రకటన జరిగి 24 గంటలు తిరగకముందే పార్టీ అసమ్మతి నేతలు పెద్దపల్లిలో ఆదివారం సమావేశం అవుతున్నారు. జిల్లాలో […]

- అధ్యక్షుని ప్రకటన వెలువడిన వెంటనే అసమ్మతి
- ఏడాది కాలంగా జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ
- సమర్థ నాయకత్వం లేకపోతే ఎన్నికలకు ఎలా వెళ్లాలని ప్రశ్న
- పెద్దపల్లిలో సమావేశమైన BJP అసమ్మతి నేతలు
విధాత బ్యూరో, కరీంనగర్: పెద్దపల్లి BJPలో అసమ్మతి భగ్గుమంది. పార్టీ జిల్లా అధ్యక్షునిగా రావుల రాజేందర్ నియామకాన్ని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా అధ్యక్షుని నియామక ప్రకటన జరిగి 24 గంటలు తిరగకముందే పార్టీ అసమ్మతి నేతలు పెద్దపల్లిలో ఆదివారం సమావేశం అవుతున్నారు.
జిల్లాలో పార్టీ పరిస్థితి, రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై వారీ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.
సుదీర్ఘ కాలం తర్జన, భర్జనల అనంతరం పెద్దపల్లి BJP అధ్యక్షుడిగా రావుల రాజేందర్ ను నియమిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014-2019 వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా, 1997-2000 వరకు రామగుండం బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేసిన రాజేందర్ ప్రస్తుతం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈయనతోపాటు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా సంతోష్ యాదవ్, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జిగా కృష్ణ, మంథని( భూపాలపల్లి లో కలసి ఉన్న ప్రాంతం) ఇన్చార్జిగా మోహన్ రావు, మంథని( పెద్దపల్లి జిల్లాలో కలిసి ఉన్న ప్రాంతం) ఇన్చార్జిగా రమేష్ లను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు.
శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా,దూకుడుగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీకి పెద్దపల్లి జిల్లాలో ‘బండి’ని ముందుకు నడిపించేవారు లేక, నామమాత్రపు కార్యక్రమాలకు పరిమితమైంది. గడచిన ఏడాదికాలంగా ఈ జిల్లాపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దృష్టి పెట్టలేకపోయారనే విమర్శలు వినవస్తున్నాయి.
బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మాజీఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీలోని గ్రూపులు,వర్గాల కారణంగా తాను ఆ పదవిలో కొనసాగలేనంటూ ఏడాది క్రితమే రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షునికి సమర్పించారు.
ఏడాదికాలంగా ఈ జిల్లా అధ్యక్ష పదవిపై ఒక నిర్ణయం తీసుకోలేని రాష్ట్ర బిజెపి నాయకత్వం చివరకు రామగుండం ప్రాంతానికి చెందిన మాజీ కౌన్సిలర్ రావు రాజేందర్ కు ఈ పదవిని కట్టబెట్టింది.
ఆయన నియామకానికి ఆమోదముద్రపడి 24 గంటలు తిరగకముందే పెద్దపల్లి బిజెపిలో అసమ్మతి భగ్గుమంది.
మూడు శాసనసభ నియోజకవర్గాలు కలిగిన పెద్దపల్లి జిల్లాకు సమర్థుడైన అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో బిజెపి నాయకత్వం విఫలమైందనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో మెట్ పల్లి, పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గాలలో బిజెపి విజయం సాధించింది. సుదీర్ఘకాలం పెద్దపల్లి లోక్ సభ సభ్యునిగా పనిచేసిన దివంగత వెంకటస్వామి కుమారుడు వివేకానంద ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
BJP దళిత మోర్చా జాతీయ కార్యదర్శిగా రామగుండం ప్రాంతానికి చెందిన ఎస్ కుమార్ కీలక బాధ్యతల్లో ఉన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని జిల్లాలో విజయతీరాలకు తీసుకువెళ్లే సమర్థత గల నాయకత్వాన్ని ఎంచుకోవడంలో BJP రాష్ట్ర నాయకత్వం విఫలమైందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీసీపీతో పాటు అనేక పరిశ్రమలకు అలవాలంగా, పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న పెద్దపల్లి జిల్లాను పార్టీ రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టిందనే అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.