ఇదేనా గుడ్ న్యూస్.. నిరాశ‌ప‌రిచిన‌ మంచు మనోజ్

విధాత‌: మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ 20వ తేదీ ఉదయం 9:45 నిమిషాలకు ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ.. తన లైఫ్‌కి సంబంధించిన కీలక ప్రకటన చేస్తున్నానని ప్రకటించాడు.. సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో అందరూ అది ఆయన రెండో వివాహానికి సంబంధించిన విషయమని ఊహించారు. కొన్ని నెలలుగా మనోజ్ భూమా మౌనిక కలిసి కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ విడాకులు జరిగాయి. ఒంటరిగా ఉంటున్నారు. వీరిద్దరికీ […]

  • By: krs    latest    Jan 21, 2023 4:22 AM IST
ఇదేనా గుడ్ న్యూస్.. నిరాశ‌ప‌రిచిన‌ మంచు మనోజ్

విధాత‌: మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ 20వ తేదీ ఉదయం 9:45 నిమిషాలకు ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ.. తన లైఫ్‌కి సంబంధించిన కీలక ప్రకటన చేస్తున్నానని ప్రకటించాడు.. సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే.

దాంతో అందరూ అది ఆయన రెండో వివాహానికి సంబంధించిన విషయమని ఊహించారు. కొన్ని నెలలుగా మనోజ్ భూమా మౌనిక కలిసి కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇద్దరికీ విడాకులు జరిగాయి. ఒంటరిగా ఉంటున్నారు. వీరిద్దరికీ వారి వారి మొదటి వివాహాలు జరగక ముందే పరిచయం ఉందట. అప్పుడు వివాహం చేసుకోవాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వేరే వ్యక్తులతో మనోజ్, మౌనికాల వివాహాలు జరిగాయనేలా టాక్ వినిపిస్తూ వస్తుంది.

2019లో మనోజ్ భార్యతో విడిపోయారు. అలాగే మౌనిక కూడా భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు కథనాలు విలువడ్డాయి. ఈ వార్తలపై మనోజ్ స్పందించలేదు.

మౌనికతో మ‌నోజ్ వివాహం ఇష్టం లేని మంచు ఫ్యామిలీ అతడిని దూరంగా పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో త‌న రెండో వివాహానికి సంబంధించిన న్యూస్‌‌ను మంచు మనోజ్ తెలియజేస్తాడని అందరూ భావించారు.

కానీ దానికి భిన్నంగా మంచు మనోజ్ తన కొత్త మూవీ ప్రకటన చేశారు. ‘వాట్ ది ఫిష్’ టైటిల్‌తో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో కొత్త మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని ఆయన విడుదల చేశారు.

డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ ‘వాట్ ది ఫిష్’ తెర‌కెక్క‌నుంది. చాలా ఏళ్ల తర్వాత మంచు మనోజ్ మేకప్ వేసుకోనున్నాడు. ఆయన చేసిన చివరి చిత్రం ఒక్కడు మిగిలాడు. ఇది 2017లో విడుదలైంది. అనంతరం కొన్ని చిత్రాలలో గెస్ట్ రోల్స్ చేశారు. 2020లో మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో ఓ పాన్ ఇన్ ఇండియా మూవీ ప్రకటించాడు. ఫస్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు.

పెళ్లి లేదంటే.. ‘అహం బ్రహ్మాస్మి’కి సంబంధించిన అప్డేట్ మంచు మనోజ్ నుంచి ఉంటుందని కొందరు ఊహించారు. కానీ అది కూడా జరగలేదు. దాంతో ఆ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే మూవీ ఆగిపోలేదు ఫ్రీ పొడక్షన్ వర్క్ జరుగుతుందని అప్పట్లో మనోజ్ స్పష్టత ఇచ్చాడు. కానీ.. ఇప్పుడు సడన్‌గా వాట్ ది ఫిష్ మూవీ ప్రకటన చేశాడు. దీంతో అహం బ్రహ్మాస్మి ఇక లేనట్లే అని అనిపిస్తోంది.