Medak: ట్రాక్టర్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చెక్కుల పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గత జూన్ 28 న ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు విద్యార్థులు, పూర్తిగా అంగవైకల్యం చెందిన ఒక విద్యార్థి కుటుంబానికి మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేశారు. 28 జూన్ 2022 న కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు […]

- పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గత జూన్ 28 న ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు విద్యార్థులు, పూర్తిగా అంగవైకల్యం చెందిన ఒక విద్యార్థి కుటుంబానికి మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేశారు.
28 జూన్ 2022 న కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు శివాయిపల్లి జశ్వంత్, తూర్పాటి రజినీకాంత్ ప్రమాదంలో మరణించగా, రాంచరణ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడి పూర్తి అంగవైకల్యం పొందాడు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్‌లతో కలిసి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్సి అభివృధి అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.