అధ్యక్షా.. రవితేజకు రొమాంటిక్ యాంగిల్స్ అవసరమా?

విధాత: మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ధమాకా’. ఒకే ఒక్క చిత్రంతో సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇందులో హీరోయిన్. వినాయకచవితిని పురస్కరించుకుని.. ఈ సినిమాలోని రొమాంటిక్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ గ్లింప్స్‌లో రవితేజని చూసిన వారంతా అనుకుంటున్న మాటేంటో తెలుసా.. ‘ఈ ఏజ్‌లో రవితేజకు రొమాంటిక్ యాంగిల్స్ అవసరమా?’ అని. నిజంగా పబ్లిక్ అనుకుంటున్న టాక్ ఇదే. ఎందుకంటే, ఇంతకుముందు చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’లో […]

అధ్యక్షా.. రవితేజకు రొమాంటిక్ యాంగిల్స్ అవసరమా?

విధాత: మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ధమాకా’. ఒకే ఒక్క చిత్రంతో సెన్సేషనల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇందులో హీరోయిన్. వినాయకచవితిని పురస్కరించుకుని.. ఈ సినిమాలోని రొమాంటిక్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు. ఈ గ్లింప్స్‌లో రవితేజని చూసిన వారంతా అనుకుంటున్న మాటేంటో తెలుసా.. ‘ఈ ఏజ్‌లో రవితేజకు రొమాంటిక్ యాంగిల్స్ అవసరమా?’ అని. నిజంగా పబ్లిక్ అనుకుంటున్న టాక్ ఇదే.

ఎందుకంటే, ఇంతకుముందు చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కూడా ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్ చేశాడు. ఆ ఇద్దరూ కూడా రవితేజకు కూతుళ్ల మాదిరిగా ఉన్నారు. అస్సలు కాంబినేషన్ సెట్ కాలేదు. ఆ సినిమాకి మైనస్ టాక్‌లలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు చేస్తున్న ‘ధమాకా’లో కూడా శ్రీలీల అతని పక్కన చిన్నపిల్లలా ఉంది.

అప్పుడెప్పుడో అనుష్క వంటి హీరోయిన్‌తో ‘విక్రమార్కుడు’ సినిమాలో రొమాంటిక్ టచ్‌లిస్తే.. అంతా క్లాప్స్ కొట్టారు. జింత్తాత జిత జితా అన్నారు. కానీ ఇప్పుడు కూడా అదే వరుసలో.. చిన్న పిల్లలతో రవితేజ రొమాన్స్‌ను కోరుకోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ఆ సినిమాలో (విక్రమార్కుడు) రవితేజని చూడటానికి చాలా బాగున్నాడు.

ఈ మధ్య ఆయన చిక్కిపోయి.. ఫేస్ అంతా అదోలా అయిపోయింది. శ్రీలీలకు కన్ను కొట్టి పక్కకు పిలుస్తున్న గ్లింప్స్ ఇది.. ఈ గ్లింప్స్‌లో రవితేజ ఫేస్ అసలు చూడలేని విధంగా ఉంది. ఆ ఫేస్‌లో మళ్లీ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్. ఈ గ్లింప్స్ విడుదల తర్వాత.. ఇక రవితేజ మారరా..! కాస్త ఏజ్‌ని బట్టి పాత్రలు ఎన్నుకుంటే బాగుంటుంది అంటూ.. సోషల్ మీడియాలో రవితేజకు ఒకటే సలహాలు.

కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌‌తో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ.. కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.