శునకాలకు ఘనంగా వివాహం.. భావోద్వేగానికి గురైన యజమాని
Dogs Marriage |విధాత: ఓ రెండు కుటుంబాలు కలిసి తమ శునకాలకు ఘనంగా వివాహం చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆ కుక్కలకు వివాహం జరిపించి.. వాటిపై తమకున్న ప్రేమను చాటారు. హల్ది నుంచి మొదలుకుంటే భరాత్ వరకు నిర్వహించారు. అంతే కాదండోయ్.. ఆ శునకాల వివాహ వేడుకకు 100 మంది అతిథులను ఆహ్వానించి, భోజనాలు పెట్టారు. ఈ వివాహ సమయంలో ఆడ కుక్క యజమాని భావోద్వేగానికి గురయ్యాడు. మరి ఈ శునకాల వివాహం గురించి తెలుసుకోవాలంటే […]

Dogs Marriage |విధాత: ఓ రెండు కుటుంబాలు కలిసి తమ శునకాలకు ఘనంగా వివాహం చేశారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆ కుక్కలకు వివాహం జరిపించి.. వాటిపై తమకున్న ప్రేమను చాటారు. హల్ది నుంచి మొదలుకుంటే భరాత్ వరకు నిర్వహించారు. అంతే కాదండోయ్.. ఆ శునకాల వివాహ వేడుకకు 100 మంది అతిథులను ఆహ్వానించి, భోజనాలు పెట్టారు. ఈ వివాహ సమయంలో ఆడ కుక్క యజమాని భావోద్వేగానికి గురయ్యాడు. మరి ఈ శునకాల వివాహం గురించి తెలుసుకోవాలంటే ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు వెళ్లాల్సిందే.
సవిత తన భర్తతో కలిసి గురుగ్రామ్‌లో నివాసం ఉంటుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. భర్త రోజు గుడికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతని వెంట ఓ కుక్క రావడం మొదలుపెట్టింది. దీంతో ఆ శునకాన్ని భర్త ఇంటికి తీసుకొచ్చి దానికి స్వీటి అని నామకరణం చేశాడు. తమకు పిల్లలు లేకపోవడంతో.. ఆ కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటూ స్వీటికి తప్పకుండా పెళ్లి చేస్తామని కూడా ఆ దంపతులు ఇరుగు పొరుగు వారికి చెప్తుండేవారు. అది కూడా సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తామని చెప్పేవారు.
At Gurugram Dog Wedding, Dhols, Baraatis And A Haldi Ceremony
Read here: https://t.co/Q8YfFW2MCa pic.twitter.com/aEHfiJXaFY
— NDTV Videos (@ndtvvideos) November 14, 2022
అయితే సవిత ఇంటికి సమీపంలోనే మనిత అనే మరో మహిళ నివాసం ఉంటుంది. ఆమె కూడా షేరూ అనే మగ కుక్కను పెంచుకుంటోంది. గత 8 ఏండ్ల నుంచి షేరూను పెంచుకుంటున్నామని, దాన్ని తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నామని మనిత పేర్కొంది. ఇక సవిత, మనిత కలిసి తమ శునకాలకు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.
నాలుగు రోజుల పాటు ఘనంగా పెళ్లి
సవిత, మనిత కుటుంబ సభ్యులు కలిసి షేరూ, స్వీటికి సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 25 పెళ్లికార్డులు ప్రింట్ చేయించారు. మరో 75 కార్డులను ఆన్ లైన్ ద్వారా సన్నిహితులకు పంపించి, ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఇక కుక్కలకు హల్ది ఫంక్షన్ నిర్వహించారు. ఆ తర్వాత జరిగే అన్ని కార్యక్రమాలను నిర్వహించి, శునకాలకు పెళ్లి చేశారు. వచ్చిన అతిథులందరికీ రుచికరమైన భోజనాన్ని వడ్డించారు.
భావోద్వేగానికి గురైన స్వీటి యజమాని
ఈ వివాహం సందర్భంగా స్వీటి యజమాని రాజా భావోద్వేగానికి గురయ్యాడు. నేను ప్రతి రోజు గుడికి వెళ్లేవాడిని. నాకు పిల్లలకు లేరు. ఓ కుక్క నా వెంబడి రావడంతో.. దాన్ని ఇంటికి తీసుకొచ్చాను. స్వీటీ అని పేరు పెట్టాను. దాన్నే తమ బిడ్డగా భావించి, పెంచుకున్నాను. పెళ్లి వేడుకలో భాగంగా స్విటీ కోసం అన్ని రకాల ఆభరణాలు, చీరలు తీసుకొచ్చి వివాహం జరిపించానని చెబుతూ రాజా భావోద్వేగానికి గురయ్యాడు.