Double Ismart | డ‌బుల్ ఇస్మార్ట్ మొద‌లు.. ఇక ర‌చ్చకి రెడీగా ఉండండి..!

Double Ismart | డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేష‌న్‌లో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మొద‌ట్లో ఈ సినిమాకి కాస్త నెగెటివ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత త‌ర్వాత మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్, రామ్ స‌ప‌రేట్‌గా ప‌లు చిత్రాలు చేశారు. ఇద్ద‌రికి […]

  • By: sn    latest    Jul 10, 2023 6:17 AM IST
Double Ismart | డ‌బుల్ ఇస్మార్ట్ మొద‌లు.. ఇక ర‌చ్చకి రెడీగా ఉండండి..!

Double Ismart |

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేష‌న్‌లో ఇస్మార్ట్ శంక‌ర్ అనే చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మొద‌ట్లో ఈ సినిమాకి కాస్త నెగెటివ్ టాక్ వ‌చ్చిన త‌ర్వాత త‌ర్వాత మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్, రామ్ స‌ప‌రేట్‌గా ప‌లు చిత్రాలు చేశారు. ఇద్ద‌రికి ఒక్క‌టంటే ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. దీంతో ఈ ఇద్ద‌రు మ‌ళ్లీ జ‌త‌ క‌ట్టి డ‌బుల్ వినోదం పంచేందుకు డ‌బుల్ ఇస్మార్ట్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.