Drone Attack | రష్యాపై దాడి వెనుక అమెరికా: క్రెమ్లిన్‌ ప్రతినిధి ఆరోపణ

Drone attack జెలెన్స్కీని చంపాలన్న మెద్వదెవ్‌ పుతిన్‌ను యుద్ధ నేరాల కింద విచారించాలి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో జెలెన్స్కీ విధాత: పుతిన్‌ టార్గెట్‌గా క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్ల దాడి యత్నాల వెనుక అమెరికా ఉన్నదని రష్యా ఆరోపించింది. బుధవారం రష్యా అధ్యక్ష భవనంపైకి వచ్చిన 2 డ్రోన్‌లను ఆ దేశ మిలిటరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే.. అమెరికా లక్ష్యాలను ఎంచితే ఉక్రెయిన్‌ వాటిని అమలు చేస్తున్న విషయం రష్యాకు తెలుసని అమెరికా గుర్తుంచుకోవాలని క్రెమ్లిన్‌ ప్రతినిధి […]

Drone Attack | రష్యాపై దాడి వెనుక అమెరికా: క్రెమ్లిన్‌ ప్రతినిధి ఆరోపణ

Drone attack

  • జెలెన్స్కీని చంపాలన్న మెద్వదెవ్‌
  • పుతిన్‌ను యుద్ధ నేరాల కింద విచారించాలి
  • అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో జెలెన్స్కీ

విధాత: పుతిన్‌ టార్గెట్‌గా క్రెమ్లిన్‌పై జరిగిన డ్రోన్ల దాడి యత్నాల వెనుక అమెరికా ఉన్నదని రష్యా ఆరోపించింది. బుధవారం రష్యా అధ్యక్ష భవనంపైకి వచ్చిన 2 డ్రోన్‌లను ఆ దేశ మిలిటరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే.

అయితే.. అమెరికా లక్ష్యాలను ఎంచితే ఉక్రెయిన్‌ వాటిని అమలు చేస్తున్న విషయం రష్యాకు తెలుసని అమెరికా గుర్తుంచుకోవాలని క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ అన్నారు. అయితే, బుధవారం నాటి ఘటనలో తమ ప్రమేయం ఏమీ లేదని ఉక్రెయిన్‌ చెబుతున్నది. దీనిని సాకుగా చూపించి, పరిస్థితిని మరింత రెచ్చగొట్టేందుకు రష్యా ఆడిన నాటకమే ఇదని ఆరోపించింది.

జెలెన్స్కీని హతమార్చాలి: మెద్వెదెవ్‌

బుధవారం నాటి ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీని, ఆయన దుష్ట మంత్రి వర్గాన్ని భౌతికంగా హతమార్చడం మినహా రష్యాకు మరో మార్గం లేదని రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌, యునైటెడ్‌ రష్యా పార్టీ అధినేత డిమిట్రీ మెద్వదెవ్‌ చెప్పారు.

యుద్ధ నేరాల కింద పుతిన్‌ను విచారించాలి: జెలెన్స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్‌ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ నేరాల కింద విచారించాలని ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్‌ చేశారు. హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో మాట్లాడిన జెలెన్స్కీ.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాము తప్పకుండా విజయం సాధించి తీరుతామని చెప్పారు. యుద్ధానికి కారకులైనవారు తగిన శిక్ష అనుభవించాలని అన్నారు.

మార్చిలో సమావేశమైన ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు పుతిన్‌పై అరెస్టు వారెంటును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యురాలిని చేస్తూ వార్‌ ట్రిబ్యునల్‌ను నెలకొల్పాలని జెలెస్స్కీ మరోసారి డిమాండ్‌ చేశారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రష్యా ఆరువేల యుద్ధ నేరాలకు పాల్పడిందని, ఫలితంగా కనీసం 207 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు.