ప్యాకెట్లు..చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ర్ను అక్రమ సరఫరా చేస్తున్న కేటుగాళ్లు పోలీసులకు దొరక్కుండా రోజురోజుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు
విధాత, హైదరాబాద్: ప్యాకెట్లు..చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ర్ను అక్రమ సరఫరా చేస్తున్న కేటుగాళ్లు పోలీసులకు దొరక్కుండా రోజురోజుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పిల్లలు చదువుకునే డిక్షనరీల రూపంలో తయారు చేసిన పెట్టెల్లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను చత్రినాక పోలీసులు పట్టుకున్నారు. అచ్చం డిక్షనరీని పోలివున్న పెట్టెలను రూపొందించి వాటిలో డ్రగ్స్ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా చాకచక్యంగా నిందితులు డ్రగ్స్ అక్రమ దందా సాగిస్తున్నారు. డిక్షనరీ పేజీ తెరువగానే పెట్టే తెరుచుకునేలా అచ్చం డిక్షనరీ మాదిరిగా పెట్టెలను తయారు చేయడంలో కేటుగాళ్ల పనితీరు చూసి పోలీసులు సైతం విస్మయం చెందారు. అయితే కేటుగాళ్లు ఎంతోకాలం పోలీసుల కళ్లుగప్పడంలో మాత్రం విఫలమై దొరికిపోయారు. డ్రగ్స్ అక్రమ సరఫరాపై నిఘా పెట్టిన చత్రినాక పోలీసులు ఆ ముఠా ఆటకట్టించి వారిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు.