ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. చెన్నైలో గుండె పోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.
తమిళ సినిమా పెద్ద హీరోలు అందరికీ ఆయనే డబ్బింగ్ చెబుతారు. ఆయన డబ్బింగ్ చెబితే ప్రేక్షకులకు వాళ్ళ అభిమాన హీరో వాయిస్‌లాగే అనిపిస్తుంది. తాజాగా తెగింపు సినిమాలో అజితకు డబ్బింగ్ చెప్పారు.
తెలుగులో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి ఎందరో స్టార్ హీరోలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెబుతూ వస్తున్నారు.
అపరిచితుడులో విక్రమ్, సింగం సూర్య, జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్, అల వైకుంఠపురంలో జయరాం ఇలా స్టార్ హీరోలందరికీ శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్పారు.