ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి చెల్లించాలని.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నల్గొండ టౌన్ సెక్రెటరీ హేమంత్ మాట్లాడుతూ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను విద్యకు దూరం […]

- ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన
- రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా నల్గొండ టౌన్ సెక్రెటరీ హేమంత్ మాట్లాడుతూ 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను విద్యకు దూరం చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.
సుమారు రూ.2200 కోట్ల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయని కారణంగా నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు సంక్షేమ హాస్టల్స్ నిర్మించాలని లేకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయేంద్ర, నల్గొండ విభాగ్ ఆఫీస్ సెక్రటరీ నాంపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.