‘ఏ మాయ చేసావే: సమంతను తలుచుకున్న చైతూ.. మనసులో ఏముందసలు?
ధాత: నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’. ఈ చిత్రం 2013 ఫిబ్రవరి 26వ తేదీన విడుదలైంది. అంటే ఇప్పటికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘సెలబ్రేటింగ్ 13 ఇయర్స్’ అని కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ కాదు కానీ.. ఈ కామెంట్‌తో పాటు ఆయన షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద […]

ధాత: నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొదటి చిత్రం ‘ఏ మాయ చేసావే’. ఈ చిత్రం 2013 ఫిబ్రవరి 26వ తేదీన విడుదలైంది. అంటే ఇప్పటికి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగ చైతన్య ‘ఏ మాయ చేసావే’ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘సెలబ్రేటింగ్ 13 ఇయర్స్’ అని కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ కాదు కానీ.. ఈ కామెంట్‌తో పాటు ఆయన షేర్ చేసిన పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది.
సమంతను కౌగిలించుకున్న పోస్టర్‌ను ఆయన షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన మాజీ భార్యను నాగచైతన్య ఇక్కడ తలుచుకున్నట్లు అయింది. ఈ క్రమంలో చైతన్యకు సమంత మీద ప్రేమ అలానే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో సమంత ఏ మాయ చేసావే చిత్ర ప్రస్తావన తేకుండా తన పదమూడేళ్ల సినీ జర్నీని ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టింది.
‘ఏ మాయ చేసావే’ చిత్రం నాగచైతన్యకు రెండవ చిత్రం. ‘జోష్’ మొదటి చిత్రం కాగా.. రెండవ చిత్రంగా ‘ఏ మాయ చేసావే’ విడుదలయ్యింది. సమంతకు మాత్రం ఇది మొదటి చిత్రం. ఈ సినిమాతో వీరిద్దరు లవ్ చేసుకోవడం, తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత గొడవలు, విడాకులు.. ఇలా జరిగిపోయింది వారి జీవితం.
అధికారికంగా వీరు విడిపోయి 14 నెలలు అవుతుంది. 2021 అక్టోబర్ నెలలో విడాకుల ప్రకటన చేశారు. దానికి కొన్ని నెలల ముందు నుంచే విడివిడిగా ఉంటున్నారు. వీరి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయ నేది తెలియదు. అయితే వ్యక్తిగత విషయాలు కావడంతో బయటికి రావడం లేదు.
సమంత కొన్ని ఇంటర్వ్యూలలో ఇన్ డైరెక్ట్‌గా నాగచైతన్యపై ఆరోపణలు చేసినా.. చైతూ మాత్రం ఎక్కడా ఓపెన్ కాలేదు. వీరిద్దరి మధ్య గొడవ మాత్రం పెద్దది అన్నది విదితం. ఈ నేపథ్యంలో కొన్ని పుకార్లు కూడా తెరపైకి వచ్చాయి. ఎక్కువగా సమంతను బ్లేమ్ చేశారు. ఆమె మీద ఆరోపణలు గుప్పించారు. ఇక సోషల్ మీడియా వేదికగా సమంత కూడా తన అసహనం బయటపెట్టింది.
బాలీవుడ్ టాక్ షో కాపీ విత్ కరణ్‌లో సమంత నేరుగానే కోపం ప్రదర్శించారు. ఆయన నా మాజీ భర్త మాత్రమే. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచాల్సి వస్తే కత్తులు కూడా ఉంచాలి వంటి కామెంట్ చేసింది. ఆ క్రమంలో సమంత కొన్నాళ్లు డిప్రెషన్ అనుభవించింది. స్నేహితుల సహకారంతో ఆధ్యాత్మిక మార్గంతో బయట పడ్డారు.
నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. అరుదుగా మాత్రమే పోస్టులు పెడుతుంటారు. ఆయన తన ఎమోషన్స్‌ను ఏ రూపంలోనూ బయట పెట్టలేదు. సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య నటించిన ‘థాంక్యూ, లాల్ సింగ్ చద్దా’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాల ప్రమోషన్స్‌కు మీడియా ముందుకు వచ్చాడు. సమంతతో విడాకుల మేటర్‌పై మాత్రం స్పందించ లేదు.
అయితే సమంత అంటే ఆయనకు ఇంకా ఇష్టం అలానే ఉందన్న వాళ్లు ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఏ మాయ చేసావే 13 ఏళ్ల జర్నీకి గుర్తుగా సమంతను కౌగిలించుకున్న ఫోటోను పోస్ట్ చేయడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతుంది. కొందరైతే.. మళ్లీ వీరిద్దరూ కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.