సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలినోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటు నియోజక వర్గాలకు ఎన్నికల కమిషన్ ఏప్రిల్19వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నది

- 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్
- 27 వరకు నామినేషన్ల స్వీకరణ- 30న ఉపసంహరణ
విధాత: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు తొలినోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటు నియోజక వర్గాలకు ఎన్నికల కమిషన్ ఏప్రిల్19వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నది. ఈ మేరకు మార్చి 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ మార్చి 30వ తేదీన ఉంటుంది.
తొలి విడత పోలింగ్‌లో తమిళనాడులో 39, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలో 5, బిహార్‌లో 4, బెంగాల్‌లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో 2, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగనున్నది.