అంగరంగ వైభవంగా.. ఏడుపాయల జాతర ప్రారంభం

మొదటి రోజు భక్తుల రద్దీతో ఏడుపాయల ప్రాంగణం కిటకిట దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు విధాత, మెదక్ బ్యూరో: అంగరంగ వైభవంగా ఏడుపాయల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister T. Harish Rao ), ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలసి దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలయ గోపురం నుంచి పట్టువస్త్రాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా […]

అంగరంగ వైభవంగా.. ఏడుపాయల జాతర ప్రారంభం
  • మొదటి రోజు భక్తుల రద్దీతో ఏడుపాయల ప్రాంగణం కిటకిట
  • దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

విధాత, మెదక్ బ్యూరో: అంగరంగ వైభవంగా ఏడుపాయల జాతర ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Minister T. Harish Rao ), ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షాతో కలసి దుర్గామాతకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలయ గోపురం నుంచి పట్టువస్త్రాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడుపాయల అభివృద్ధికి మహాశివరాత్రి జాతరకు సీఎం కేసీఆర్ నిదులు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అందులో భాగంగానే కొండగట్టు అంజన్న దేవాలయం అబివృద్దికి 1000 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. యాదాద్రినీ సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు.

రాబోయే రోజుల్లో ఏడుపాయల ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. వేదపండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాలయాల ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు గర్వించేలా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందన్నారు.

  • పూర్ణకుంభంతో.. స్వాగతం.

మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, చికుముల మదన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా లకు వేద బ్రాహ్మణులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ బాలగౌడ్, ఈవో శ్రీనివాస్ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యేలలను శాలువాలతో సన్నానిచారు. వేద బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ప్రతిమా సింగ్, రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.