ఏడుపాయల జాతర.. రూ.2 కోట్లు మంజూరు
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నాగ్సాని పల్లి గ్రామ శివారులో ఉన్న తెలంగాణలోని అతి పెద్ద 2 వ దేవాలయం వనదుర్గా మాత ఆలయం అవరణలో జరిగే జాతర కోసం సీఎం కెసిఆర్ 2 కోట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కోరిక మేరకు ఈ నిధులు మంజూరు అయ్యాయి. ఏడుపాయల అభివృద్ధి కోసం సీఎం నిధులు కేటాయించారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత […]

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నాగ్సాని పల్లి గ్రామ శివారులో ఉన్న తెలంగాణలోని అతి పెద్ద 2 వ దేవాలయం వనదుర్గా మాత ఆలయం అవరణలో జరిగే జాతర కోసం సీఎం కెసిఆర్ 2 కోట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కోరిక మేరకు ఈ నిధులు మంజూరు అయ్యాయి.
ఏడుపాయల అభివృద్ధి కోసం సీఎం నిధులు కేటాయించారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలంగాణ పండుగలు, జాతరలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు.
ఏడుపాయల జాతరకు తెలంగాణ నుండే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కెసిఆర్ కు అందుకు సహకరించిన మంత్రి హరీష్ రావు కు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కృత్ఞతలు తెలిపారు.