రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌

రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. శుక్రవారం జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌
  • ఏడు విడతల్లో పార్లమెంటు ఎన్నికలు
  • ఏప్రీల్‌ 11, 18, 23,29 తేదీల్లో నాలుగు విడతలు
  • మే 6, 12, 19వ తేదీన మూడు విడతలు

విధాత, హైదరాబాద్ : పార్లమెంటు ఎన్నికలను ఏడు విడతల్లో జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లుగా సమాచారం. దీనిపై రేపు శనివారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం నిర్వహించే ప్రెస్‌మీట్‌లో వెల్లడించే షెడ్యూల్‌లో అధికారికంగా స్పష్టత రానుంది. ఎన్నికల సంఘం నిర్వహించిన కసరత్తు మేరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.

తొలి విడతలో

ఏప్రిల్‌ 11వ తేదీన తొలి విడతగా 20రాష్ట్రాల్లో 91పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో ఏపీలోని మొత్తం 25లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరుగడంతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2, అస్సామ్‌లో 5, బీహార్‌లో 4, చత్తీస్‌ఘడ్‌లో 1, జమ్మూకాశ్మీర్‌లో 2, మహరాష్ట్రలో 7, మణిపూర్‌ 1, మేఘాలయాలో 2, మిజోరాంలో 1, నాగాలాండ్‌లో1, ఒడిస్సాలో 4, సిక్కింలో 1, తెలంగాణలో మొత్తం 17, త్రిపురంలో 1, యూపీలో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమబెంగాల్‌లో 2, అండమాన్‌ నికోబార్‌లో 1, లక్ష్యద్వీప్‌లో 1 పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

రెండోవిడతలో

ఏప్రిల్‌ 18వ తేదీన జరిగే రెండో విడతలో 13రాష్ట్రాలలోని 97లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వాటిలో అస్సాంలో 5, బీహార్‌లో 5, చత్తీస్‌ఘడ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌లో 2, కర్ణాటకలో 14, మహరాష్ట్రలో 10, మణిపూర్‌లో 1, ఒడిస్సాలో 5, తమిళనాడులో మొత్తం 39, త్రిపురలో 1, యూపీలో 8, పశ్చిమ బెంగాల్‌లో 3, పుదుచ్చేరిలో 1 స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

మూడో విడతలో

ఏప్రిల్‌ 23న జరిగే మూడో విడతలో 14 రాష్ట్రాల్లోని 115లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. అస్సాంలో 4, బీహార్‌లో 5, చత్తీస్‌ఘడ్‌లో 7, గుజరాత్‌లో మొత్తం 26, గోవాలో 2, జమ్మూకాశ్మీర్‌లో 1, కర్ణాటలో 14, కేరళలో మొత్తం 20, మహరాష్ట్రలో 14, ఒడిస్సాలో 6, యూపీలో 10, పశ్చిమ బెంగాల్‌లో 5, దాంద్రనగర్‌ హవేలీలో 1, డామన్‌ డయ్యూలో 1స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

నాల్గవ విడతలో

ఏప్రిల్‌ 29న జరిగే నాల్గవ విడతలో 9రాష్ట్రాలలోని 71స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. బీహార్‌లో 5, జమ్మూకాశ్మీర్‌లో 1, జర్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్రంలో 17, ఒడిస్సాలో 6, రాజస్థాన్‌లో 13, యూపీలో 13, పశ్చిమబెంగాల్‌లో 8 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి

ఐదవ విడతలో

మే 6వ తేదీన 7 రాష్ట్రాల్లో 51సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, జమ్మూకాశ్మీర్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 7, రాజస్థాన్‌లో 12, యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 7 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఆరో విడతలో

మే 12వ తేదీన 7 రాష్ట్రాల్లో 59స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో 8, హర్యానా 10, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, యూపీలో 14, పశ్చిమబెంగాల్‌లో 8, ఢిల్లీలో మొత్తం 7లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏడో విడతలో

మే 19న జరిగే ఏడో విడతలో 8 రాష్ట్రాలకు చెందిన 59లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో 8, జార్ఞండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 8, పంజాబ్‌లో మొత్తం 13, పశ్చిమ బెంగాల్‌లో 9, చంఢీఘర్‌ 1, యూపీ 13, హిమాచల్‌ ప్రదేశ్‌ మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహణతో లోక్‌ సభ ఎన్నికల ప్రక్రియ ముగియ్యనుంది.