కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నిక‌లు: కోమ‌టిరెడ్డి

విధాత‌: కర్ణాటకతో పాటు తెలంగాణలోను ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. అందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ చేపట్టిన 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనడానికి ఆయన నిర్మల్‌ జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని, నైతికంగా తనదే విజయం అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10 స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకుంటున్నట్లు […]

  • By: krs    latest    Nov 28, 2022 5:16 PM IST
కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నిక‌లు: కోమ‌టిరెడ్డి

విధాత‌: కర్ణాటకతో పాటు తెలంగాణలోను ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. అందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బండి సంజయ్‌ చేపట్టిన 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనడానికి ఆయన నిర్మల్‌ జిల్లాకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగంతో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిందని, నైతికంగా తనదే విజయం అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 10 స్థానాలు గెలిపించే బాధ్యత తీసుకుంటున్నట్లు రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఆదరణ చూసి కేసీఆర్‌లో భయం నెలకొన్నదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, బలమైన నాయకులు లేరు అని తెలిపారు.