ఆసుపత్రిలోకి వచ్చిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Viral Video | సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్వుల పువ్వులు పూయించడంతో పాటు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని బాధను కలిగించేలా ఉంటాయి. సాధారణంగా ఏనుగులు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగానే ఉండడం మంచిది. అయితే, ఏదైనా పెద్ద జంతువు నొప్పితే బాధపడుతుంటే మానవత్వంతో వ్యవహరించాలంటున్నారు. తాజాగా ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]

Viral Video | సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని నవ్వుల పువ్వులు పూయించడంతో పాటు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మరికొన్ని బాధను కలిగించేలా ఉంటాయి. సాధారణంగా ఏనుగులు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగానే ఉండడం మంచిది.
అయితే, ఏదైనా పెద్ద జంతువు నొప్పితే బాధపడుతుంటే మానవత్వంతో వ్యవహరించాలంటున్నారు. తాజాగా ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అడవి ఏనుగు తీవ్రమైన సమస్యతో ఆసుపత్రికి వచ్చింది. ఆ తర్వాత వైద్యుడు ఎక్స్‌రే తీసేందుకు ఓ రూమ్‌లోకు తీసుకు వెళ్లాడు.
అక్కడ మనుషులకంటే మెరుగ్గా డాక్టర్‌కు సహకరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ఆకట్టకుంటున్నది. కొందరు వ్యక్తులకు వైద్యం చేయడమే ఈ రోజుల్లో కష్టం. వైద్యులు చెప్పినట్లుగా వినరు.. చెప్పిన నియమాలు పాటించరు. కానీ, ఏనుగు మాత్రం వైద్యుడికి అన్ని విధాలా సహకరించి.. వైద్యులతో దుసురుగా ప్రవర్తించే కొందరు రోగులకు మర్యాదను నేర్పుతున్నది.
ఆసుపత్రిలోకి వచ్చిన ఏనుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? https://t.co/ALUDq6hZ2k pic.twitter.com/YHnJ2QNRoD
— vidhaathanews (@vidhaathanews) December 8, 2022
కావేరి అనే నెటిజన్ షేర్ చేసిన ఈ వీడియో అందరినీ ఆలోచింప జేస్తుంది. ఈ వీడియోలో భారీ ఏనుగు ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చింది. అయితే, డాక్టర్లు దానికి ఎక్స్‌రే తీయాలని నిర్ణయించి ఎక్స్‌రే గదిలోకి తీసుకెళ్లారు. ఎంతో వినయంగా వైద్యులు చెప్పినట్లుగా చేస్తూ ఎక్స్‌రే తీసేందుకు సహకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. ఏనుగుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.