Elon Musk విధాత: ట్విట్టర్ అధినేత ఇలాన్ మస్క్, మెటా అధినేత జుకర్ బర్గ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ వేదిక ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య మంటలు చెలరేగాయి. సామాజిక మాధ్యమవేదికగా థ్రెడ్స్ చాలా వేగంగా గుర్తింపుపొందుతున్నది. తొలి 24గంటల్లోనే ఏడు కోట్ల మంది థ్రెడ్స్‌ను వేదికగా ఎంచుకున్నారు. ట్విట్టర్నుకాపీ కొట్టి థ్రెడ్స్నుతెచ్చారని మస్క్ ఆరోపిస్తున్నారు. మేథోహక్కుల అపహరణ కింద కోర్టులో దావా వేస్తామని కూడా మస్క్ హెచ్చరించారు. జుక్ ఒకకుక్ […]
Elon Musk
విధాత: ట్విట్టర్ అధినేత ఇలాన్ మస్క్, మెటా అధినేత జుకర్ బర్గ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్ వేదిక ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇద్దరి మధ్య మంటలు చెలరేగాయి. సామాజిక మాధ్యమవేదికగా థ్రెడ్స్ చాలా వేగంగా గుర్తింపుపొందుతున్నది. తొలి 24గంటల్లోనే ఏడు కోట్ల మంది థ్రెడ్స్‌ను వేదికగా ఎంచుకున్నారు. ట్విట్టర్నుకాపీ కొట్టి థ్రెడ్స్నుతెచ్చారని మస్క్ ఆరోపిస్తున్నారు.
మేథోహక్కుల అపహరణ కింద కోర్టులో దావా వేస్తామని కూడా మస్క్ హెచ్చరించారు. జుక్ ఒకకుక్ అనిమస్క్ నిందించాడు. కుక్ అంటే పిచ్చోడు అని, తెలివితక్కువ వాడని అర్థాలు ఉన్నాయి. మస్క్ విమర్శకు జుక్ ఒక ఇమోజీ పెట్టి స్పందించాడు. మస్క్‌కు నిజంగా పిచ్చి పట్టాలంటే అంతరిక్షానికి వెళ్లాలని కొందరు జుక్కు సలహా ఇచ్చారు.
మరొక ట్వీటులోఎవరిది పొడవు ఉందో కొలతవేద్దామని మస్క్ ఉడుక్కున్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుతుంది అని మస్క్ అంటే బ్రాండుల స్వేచ్ఛను కాపాడుతుంది అని జుక్ అన్నారు. మస్క్ మితవాదుల పక్షాన వకాల్తాపుచ్చుకుంటున్నాడని అమెరికాలో కొందరు మేధావులు విమర్శిస్తున్నారు