టీజీఓ అధ్య‌క్షులుగా ఏలూరి శ్రీ‌నివాస్ రావు

తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్‌ (టీజీఓ)కేంద్ర సంఘానికి అధ్య‌క్షుడిగా ఏలూరి శ్రీ‌నివాస్ రావు అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు

  • Publish Date - February 20, 2024 / 11:55 AM IST

ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎ. స‌త్య‌నారాయ‌ణ‌

ఏక‌గ్రీంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించిన రిట‌ర్నింగ్ అధికారి



విధాత‌: తెలంగాణ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్‌ (టీజీఓ)కేంద్ర సంఘానికి అధ్య‌క్షుడిగా ఏలూరి శ్రీ‌నివాస్ రావు అధ్య‌క్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఎల్‌బీ న‌గ‌ర్ ప‌ల్ల‌వి గార్డెన్స్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కార్య‌వ‌ర్గం ఏక‌గ్రీవంగా ఎన్నికైంది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఏ స‌త్య‌నారాయ‌ణ‌, ఉపాధ్య‌క్షులుగా ఎ. జ‌గ‌న్మోహ‌న్‌రావు, జాయింట్ సెక్ర‌ట‌రీగా ఎ. ప్రేమేశ్వ‌ర్‌రెడ్డి, కోశాధికారిగా మందాడి ఉపేంద‌ర్‌రెడ్డి, మ‌హిళా రిప్ర‌జంటేటీవ్‌గా జి. దీపారెడ్డి, కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా పంతంగి యాద‌గిరిల‌ను ఎన్నుకున్నారు.


ఈ మేర‌కు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి అధికారికంగా వెల్ల‌డించారు. ఏక‌గ్రీంగా ఎన్నుకోబ‌డిన కార్య‌వ‌ర్గ ప‌భ్యులంద‌రికీ టీజీవో హైదరాబాద్ జిల్లా పక్షాన అధ్య‌క్షులు ఎంబీ. కృష్ణ యాదవ్ తోపాటు జిల్లా నాయ‌కులు ఖాదర్, డాక్ట‌ర్‌ హరికృష్ణ. శ్రినేష్ కుమార్, రవీంద్ర కుమార్, స్వరూప రాణి, ఎంజులా రెడ్డి, పూనం, కుమార్, నాగేశ్వరరావు, డాక్టర్ సురేందర్, నరేష్, చిత్తరంజన్ రెడ్డి, డాక్టర్ సునీత జోషి తదితరులు శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో ఉన్నారు.