లోక్‌స‌భ‌కు పోటీ చేసే సీటుపై ఈట‌ల క్లారిటీ

లోక్‌స‌భ‌కు పోటీ చేసే సీటుపై ఈట‌ల క్లారిటీ
  • పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం


విధాత : పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజీగిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని, ఎంపీ టికెట్ హామీతో కాంగ్రెస్‌లో చేరబోతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఈటల కొట్టిపారేశారు.


పదవుల కోసం తాను పార్టీ మారే వ్యక్తిని కాదని, తన ప్రత్యర్థులు లేక పార్టీలో తాను కొనసాగడం లేని ఇష్టం లేని వారు నేను పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్‌, హుజూరాబాద్ నియోజవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు. దీంతో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెట్టారు.