WARANGAL: ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? ముందు నీ భార్యకు విడాకులివ్వు: షర్మిల

హామీలు అమలు చేయని నువ్వు కొజ్జా ప్రశ్నిస్తే కొజ్జాలు అంటావా..? ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల విమర్శలు మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ (shankar naik) నాయక్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా విరుచుకబడ్డారు. కొజ్జా అంటూ ప్రతి దాడి చేశారు. లంచగొండి ఉద్యోగిగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ఆస్తులను దోచుకుంటున్నావని మండిపడ్డారు. నిజాయితీ ఉంటే నీ భార్యకు విడాకులు ఇవ్వమని సవాల్ చేశారు. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: […]

WARANGAL: ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? ముందు నీ భార్యకు విడాకులివ్వు: షర్మిల
  • హామీలు అమలు చేయని నువ్వు కొజ్జా
  • ప్రశ్నిస్తే కొజ్జాలు అంటావా..?
  • ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల విమర్శలు

మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ (shankar naik) నాయక్ పై YSRTP అధ్యక్షురాలు షర్మిల తీవ్రంగా విరుచుకబడ్డారు. కొజ్జా అంటూ ప్రతి దాడి చేశారు. లంచగొండి ఉద్యోగిగా ఉండి ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల ఆస్తులను దోచుకుంటున్నావని మండిపడ్డారు. నిజాయితీ ఉంటే నీ భార్యకు విడాకులు ఇవ్వమని సవాల్ చేశారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోకపోతే నువ్వు కాదారా కొజ్జా..? రైతు రుణమాఫీ చేయని మీరు కొజ్జాలు కాక ఏమైతరు రా అని అడుగుతున్నానని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (sharmila) అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద శనివారం జరిగిన బహిరంగ సభలో (public meeting) ఆమె ప్రసంగించారు.

హిజ్రాలకు దేశంలో గౌరవం ఉంది. ఎమ్మెల్యే నీకు మాత్రం లేదన్నారు. ప్రజల పక్షాన నిలబడితే కొజ్జాలు అంటున్నాడు. 6 నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాక ఏమైతర్రా అని అడుగుతున్నాం. మీకు పరిపాలన చేతనయ్యిందా..? ఒక మహిళను పట్టుకొని కొజ్జా అని అంటావా..? నువ్వు కొజ్జా అంటే నేను ఊరుకోవాలా..? హిజ్రాలు దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. ఈ ఎమ్మెల్యే కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చితే వాళ్ళను అవమాన పరిచినట్లేననీ విమర్శించారు.

నీ భార్యకు విడాకులు (divorce)ఇవ్వు

మేము వలసదారులం అంట. మరి నీ భార్య ఎక్కడ నుంచి వచ్చింది. నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నవు కదా? నీకు తెలంగాణపై అంత ప్రేమ ఉంటే.. నీ భార్యకు విడాకులు ఇవ్వు. నిజానికి నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలి. ఒక IAS చెయ్యి పట్టుకున్న నాడే నీకు విడాకులు ఇవ్వాల్సి ఉంది. ఒకప్పుడు AEగా పని చేసి ఏసీబీ (ACB)లో పట్టుబడ్డావట.

ఈ లంచగొండి ఉద్యోగం పోగొట్టుకొని ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు. లంచగొండి ఎమ్మెల్యే మొత్తం నియోజక వర్గాన్ని (constituency) దోచుకున్నాడని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక మహబూబాబాద్ ఎంపీ కవిత (kavitha)మహిళ.. బాగానే ఉంది. నన్ను తిట్టడం కాదు.. ఈ పార్లమెంట్ (parlament)నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పు అంటూ ప్రశ్నించారు.