సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన మాజీ మంత్రి పట్నం
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు

విధాత: బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మహేందర్ రెడ్డి తన భార్య వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతతో కలిసి సీఎంతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో వారు కాంగ్రెస్ లో చేరిపోతారని ప్రచారం వినబడుతుంది. తాండూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ల మధ్య వైరం కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ వారి మధ్య సయోధ్య కుదిరించినప్పటికి ఫలించలేదు.