ఎవర్రా మీరంతా.. ఎంతకు తెగించారు: YS షర్మిలపై పేలుతున్న వ్యంగ్యాస్త్రాలు
విధాత: నాడు నంద్యాల ఎన్నికల ప్రచార సభలో హైదరాబాద్‌కు వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా అని వైఎస్ ప్రశ్నించారు. ఆ తర్వాత ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓదార్పు యాత్ర పేరుతో దండయాత్ర చేశాడు. ఫలితంగా మానుకోట ఎప్పటికీ మర్చిపోలేని చరిత్రగా మిగిలిపోయింది. అంతేకాదు నాడు వైఎస్ఆర్సీపీ గుర్తుపై పోటీ చేసిన కొండా సురేఖకు పరకాల ప్రజలు ఏపీ మూలాలు ఉన్న పార్టీలకు ఇక్కడ స్థానం లేదని తమ తీర్పు ద్వారా జవాబు ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత […]

విధాత: నాడు నంద్యాల ఎన్నికల ప్రచార సభలో హైదరాబాద్‌కు వెళ్ళాలంటే వీసా తీసుకోవాలా అని వైఎస్ ప్రశ్నించారు. ఆ తర్వాత ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఓదార్పు యాత్ర పేరుతో దండయాత్ర చేశాడు. ఫలితంగా మానుకోట ఎప్పటికీ మర్చిపోలేని చరిత్రగా మిగిలిపోయింది. అంతేకాదు నాడు వైఎస్ఆర్సీపీ గుర్తుపై పోటీ చేసిన కొండా సురేఖకు పరకాల ప్రజలు ఏపీ మూలాలు ఉన్న పార్టీలకు ఇక్కడ స్థానం లేదని తమ తీర్పు ద్వారా జవాబు ఇచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్ల మెంట్ స్థానంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నది. కానీ మారిన రాజ కీయ పరిణామాలతో వాళ్లంతా టీఆరెఎస్ లో చేరారు. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలకు జగన్ పార్టీ దూరంగా ఉంటున్నది. ఆ పార్టీ విధానాన్ని కూడా ప్రకటించింది. కానీ వైఎస్ కుటుంభంలో నెలకొన్న విభేదాలు ఏపీ, తెలంగాణ ప్రజల సమస్యగా షర్మిల, ఆమె తల్లి విజయమ్మ చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఏపీలో పార్టీ పెట్టకుండా ఇక్కడ పార్టీ పెట్టి రాజకీయాలు మొదలు పెట్టారు. అయితే రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి రావచ్చు. కానీ బల ప్రదర్శన చేయడం, ముఖ్యమంత్రి, మంత్రులపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం చూస్తుంటే షర్మిలలో ఆధిపత్య అహంకార ధోరణి కనబడుతున్నదనే విమర్శలు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
అప్పుడు హైదరబాద్ నీ పాకిస్ధాన్ తో పోల్చినవు..
ఇప్పుడు అదే హైదరాబాద్ సంక నాకుతున్నవ్..
సిగ్గు లజ్జ లేని బతుకులు.. ఎందుకు పుడతారో.
ఇష్టం వచ్చిన కూతలు కూయడం.. మహిళ సెంటిమెంట్ వాడడం. ఎందుకు బతకాలి ఈ బతుకు pic.twitter.com/gjF3TI7t5u— Ragnar (@Bleed_pink_) November 29, 2022
ఇవాళ విజయమ్మ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏపీ గురించి, జగన్ పాలన గురించి విలేకర్లు ప్రశ్నిస్తే ఆ రాష్ట్రం గురించి మనకు ఎందుకు? జగన్ ప్రభుత్వ ప్రస్తావన ఎందుకు అని మాట్లాడారు. అంటే తెలంగాణ రాష్ట్రం మాత్రం తమరి రాజకీయాలకు ప్రయోగశాల కావాలా? చంద్రబాబు, జేపీకి, పవన్‌కు, షర్మిలకు, పాల్‌కు ఇక్కడి రాజకీయాలతో ఏం పని? వైఎస్ తెలంగాణకు వ్యతిరేకమా కాదా అన్నది రేపు ఎన్నికల్లో ప్రజలు చెబుతారని అన్నారు. పరకాల ఉప ఎన్నికలో మీరు ప్రచారం చేశారు. అక్కడి ప్రజల తీర్పు అప్పుడే మర్చిపోయారా అని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎవర్రా మీరంతా అని.. ఎంతకు తెగించారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
విజయమ్మ పెర్ఫార్మెన్స్ :
ఇప్పుడు ఆ రాష్ట్రంతో , జగన్మోహన్ రెడ్డి తో మనకి పని ఏంటమ్మా !? ( రెండు సార్లు ) pic.twitter.com/Sje3wrd2yZ
— Telugu360 (@Telugu360) November 29, 2022
తెలంగాణ ను పాకిస్తాన్ తో పోల్చిన నీకు ఇక్కడ ఏం పని మా బతుకు మమ్మల్ని బతకనివ్వరా. ఇలాంటి రెచ్చ గొట్టే వాఖ్యలు చేసే ఇక్కడి దాకా తెచ్చుకున్నావ్. ఇన్ని రోజులు తెలంగాణ ను దోచుకుంది చాల్లేదా ఏంది. కాస్తా కూస్తో తెలంగాణ లో మీ అయ్యకి కొంత మంచి పేరు ఉండేది దాన్ని కూడా నువ్వు నాశనం చేశావ్
— Thirupathi rella (@ThirupathiRella) November 29, 2022