ఇదీ నీ పతారా.. బండిపై పేలుతున్న సెటైర్లు
విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని, దాని సూత్రధారి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించారు. యాదాద్రీశునిపై ప్రమాణం చేసిన సంజయ్ ఈ విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుంటే సవాల్‌ను స్వీకరించి, యాదాద్రిలో ప్రమాణం చేసేవారని అన్నారు. అయితే ఎమ్మెల్యేలకు ఎర అంశం వెలుగులోకి వచ్చాక ఇందుకు బాధ్యులైన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో […]

విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని, దాని సూత్రధారి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆరోపించారు. యాదాద్రీశునిపై ప్రమాణం చేసిన సంజయ్ ఈ విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుంటే సవాల్‌ను స్వీకరించి, యాదాద్రిలో ప్రమాణం చేసేవారని అన్నారు.
అయితే ఎమ్మెల్యేలకు ఎర అంశం వెలుగులోకి వచ్చాక ఇందుకు బాధ్యులైన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నది.
కానీ ఎంపీగా ఉండి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉన్నది. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. కోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి ఏది నిజం ఏది అబద్ధమో తేలుతుంది. అప్పటిదాకా వేచి ఉండాలి అంతేగానీ మెదడులో తట్టిన చేత.. నోటెంట వచ్చిన మాటల్లా చేసుకుంటూ పొతే అవతలి వారికి చులకన కావాల్సి వస్తుంది.
ఈ వ్యవహరంలో హుందాగా ప్రవర్తించాల్సిన ఓ ప్రజా ప్రతినిధి చట్టాలపై, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచకుండా భక్తి విశ్వాసాలను ఈ వివాదంలోకి తీసుకు రావడంపై ప్రజలే కాదు, సొంత పార్టీలోనే ఆయనపై సెటైర్స్ వేసే పరిస్థితి వస్తుంది.
ఇకపోతే.. బండి అతి చూసిన నెటిజన్లు నీకు అంత సీన్ లేదని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నిన్న టీఆర్‌ఎస్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌లలో నిందితులు జరిపిన సంభాషణలలో “కమిట్మెంట్ ఇవ్వడం బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నాయకుల చేతుల్లోనో లేదు.” అనే కామెంట్లను టాముందు పెట్టి ఇగో ఇదీ నీ పతారా అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.