వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కన్న కొడుకుని గొంతు నులిమి చంపిన తండ్రి
విధాత: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే ఆ బిడ్డ పట్ల కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత కుమారుడినే గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలోని ధారావిలో 22 ఏండ్ల వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. ఆ వ్యక్తి వృత్తిరీత్యా దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్. అయితే అతనికి ఓ యువతి పరిచయం కాగా, ఆమెతో వివాహేతర సంబంధం […]

విధాత: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే ఆ బిడ్డ పట్ల కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సొంత కుమారుడినే గొంతు నులిమి చంపేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలోని ధారావిలో 22 ఏండ్ల వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి జీవిస్తున్నాడు. ఆ వ్యక్తి వృత్తిరీత్యా దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్. అయితే అతనికి ఓ యువతి పరిచయం కాగా, ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
తనను పెళ్లి చేసుకోవాలంటే.. భార్య, కుమారుడిని అంతమొందించాలని, ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు షరతు విధించింది. దీంతో తన భార్య, కుమారుడిని చంపేందుకు టైలర్ సిద్ధమయ్యాడు. ముందుగా తన కుమారుడికి చాక్లెట్ ఇప్పిస్తానని బయటకు తీసుకొచ్చాడు. తాను పని చేస్తున్న దుకాణం వద్దక తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు.
అనంతరం అదే రాత్రి మృతదేహాన్ని మీఠీ నదిలో పడేశాడు టైలర్. బాలుడు కనిపించక పోవడంతో బంధువులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీఠీ నదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.
ప్లాస్టిక్ బ్యాగ్‌లో చుట్టి ఉంచిన డెడ్‌బాడీ తల, చేయి భాగాన్ని ఎలుకలు కొరికేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తన కుమారుడిని తానే హతమార్చినట్లు టైలర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించారు పోలీసులు.