మచ్చ రవి: దర్శకుడిగా ఫట్.. నటుడిగా హిట్!
విధాత: తెలుగు సినీ పరిశ్రమకు మచ్చ రవిగా బీవీఎస్ రవి అందరికీ పరిచయమే. అనేక చిత్రాలకు రచయితగా, సహా రచయితగా, సంభాషణ రచయితగా ఆయన పనిచేశారు. ఆయన దర్శకత్వం కూడా వహించారు. వాంటెడ్, జవాన్ అనే సినిమాలు తీశారు. అయితే ఆ చిత్రాలు పెద్దగా ఆడక పోవడంతో మరలా దర్శకత్వం అవకాశం రాలేదు. అయినా ఇండస్ట్రీలో తనకున్న స్నేహాలతో ఆయన పలు బడా ప్రాజెక్టులకు రచనా సహకారం అందిస్తున్నారు. మరోవైపు నటునిగా మెప్పిస్తున్నారు. ఈమధ్య ధమాకా సినిమాలో […]

విధాత: తెలుగు సినీ పరిశ్రమకు మచ్చ రవిగా బీవీఎస్ రవి అందరికీ పరిచయమే. అనేక చిత్రాలకు రచయితగా, సహా రచయితగా, సంభాషణ రచయితగా ఆయన పనిచేశారు. ఆయన దర్శకత్వం కూడా వహించారు. వాంటెడ్, జవాన్ అనే సినిమాలు తీశారు.
అయితే ఆ చిత్రాలు పెద్దగా ఆడక పోవడంతో మరలా దర్శకత్వం అవకాశం రాలేదు. అయినా ఇండస్ట్రీలో తనకున్న స్నేహాలతో ఆయన పలు బడా ప్రాజెక్టులకు రచనా సహకారం అందిస్తున్నారు. మరోవైపు నటునిగా మెప్పిస్తున్నారు.
ఈమధ్య ధమాకా సినిమాలో హైదరాబాద్ పహిల్వాన్ పాత్రలో కనిపించి రవితేజ చేతిలో దెబ్బలు తిని హాట్ టాపిక్ అయ్యారు. వీరసింహారెడ్డిలో ఒక పాత్రలో మెరవడమే కాదు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా బీవీఎస్ రవి చిన్న పాత్రలో కనిపించారు. సినిమాలో ఒకటి రెండు సీన్స్ అయినా కూడా అందరి దృష్టి రవి పై పడింది.
ఎందుకంటే ఆయన నటించిన ధమాకా, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూడు చిత్రాలు వందల కోట్ల మార్కులు అందుకోవడమే. కేవలం నెల వ్యవధిలోనే 300 కోట్ల సినిమాల్లో భాగమయ్యారు. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య 200 కోట్లను దాటేసి 250 కోట్ల దిశగా దూసుకుని వెళ్తోంది. బాలయ్య వీర సింహారెడ్డి, రవితేజ ధమాకా సినిమాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు టచ్ చేశాయి.
ఒకవైపు బీవీఎస్ రవి రచయితగా, సహాయ రచయితగా, నటుడిగా చేస్తూనే మరోపక్క అన్ స్టాపబుల్ విత్ ఎన్బికెషోకి రైటర్‌గా, డైరెక్టర్‌గా పని చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేస్తూ బీవీఎస్ రవి మాట్లాడిన మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.