చేత‌బ‌డి నెపంతో మాన‌వ మ‌లాన్ని బ‌ల‌వంతంగా తినిపించారు..

విధాత: చేత‌బ‌డి నెపంతో ఓ న‌లుగురికి బ‌ల‌వంతంగా మాన‌వ మ‌లాన్ని తినిపించారు. మూత్రం తాగించారు. వేడి వేడి ఐర‌న్ రాడ్ల‌తో శ‌ర‌రీమంతా వాత‌లు పెట్టారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ద‌మ్కా జిల్లాలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌మ్కా జిల్లాలోని ఆశ్వ‌రి గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి బిడ్డ‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. త‌మ బిడ్డ‌కు చేత‌బ‌డి చేశార‌ని అనుమానం పెంచుకున్నాడు. దీంతో గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని స‌ద‌రు వ్య‌క్తి టార్గెట్ చేశాడు. వారే […]

చేత‌బ‌డి నెపంతో మాన‌వ మ‌లాన్ని బ‌ల‌వంతంగా తినిపించారు..

విధాత: చేత‌బ‌డి నెపంతో ఓ న‌లుగురికి బ‌ల‌వంతంగా మాన‌వ మ‌లాన్ని తినిపించారు. మూత్రం తాగించారు. వేడి వేడి ఐర‌న్ రాడ్ల‌తో శ‌ర‌రీమంతా వాత‌లు పెట్టారు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ద‌మ్కా జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌మ్కా జిల్లాలోని ఆశ్వ‌రి గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి బిడ్డ‌ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. త‌మ బిడ్డ‌కు చేత‌బ‌డి చేశార‌ని అనుమానం పెంచుకున్నాడు. దీంతో గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని స‌ద‌రు వ్య‌క్తి టార్గెట్ చేశాడు. వారే చేత‌బ‌డి చేశార‌ని అనుమానించి, ముగ్గురు మ‌హిళ‌ల‌తో పాటు ఒక వ్య‌క్తిపై దాడి చేశారు.

వేడి వేడి ఇనుప రాడ్ల‌తో శ‌రీర‌మంతా వాత‌లు పెట్టారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ న‌లుగురికి బ‌ల‌వంతంగా మాన‌వ మ‌లం తినిపించారు. మూత్రం తాగించి పైశాచిక ఆనందం పొందారు. ఈ విష‌యం పోలీసుల దాకా చేర‌డంతో.. హుటాహుటిన ఆశ్వ‌రి గ్రామానికి వారు చేరుకున్నారు. బాధిత వ్య‌క్తుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. మాన‌వ మ‌లం తినిపించిన ఆరుగురు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.