ఏపీలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ! ఒకరు మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం
విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును […]

విధాత: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుకు దూసుకెళ్లడంతో పాటు.. అక్కడే ఉన్న మరో ఆటోను తోసుకు వెళ్లింది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సుపల్టీ కొట్టకొండా చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ఉండగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య(55) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.