Female professor suicide: ఏపీలో మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయపూర్ కు చెందిన యోజిత సాహో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో అద్దె భవనంలో ఘటన చోటుచేసుకుంది. ఆమె సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తుంది.

Female professor suicide: ఏపీలో మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

Female professor suicide: ఏపీలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్ గా పనిచేస్తున్న యోజిత సాహో (28) ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. చత్తీస్ గఢ్ రాష్ట్రం రాయపూర్ కు చెందిన యోజిత సాహో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో అద్దె భవనంలో ఘటన చోటుచేసుకుంది.

ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యోజిత సాహో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యోజిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.