Fight For Rice In USA | ఎన్నారైల బియ్యం కష్టాలు.. అమెరికా స్టోర్లలో తోపులాటలు, నో స్టాక్ బోర్డులు
Fight For Rice In USA విధాత: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో.. విదేశాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికా (America) లో ఈ నిషేధం ప్రభావం ఎక్కువగా కనపించింది. ఇక్కడ భారతీయులు ఎక్కువగా ఉండే బే ఏరియా, న్యూజెర్సీ, డల్లాస్ తదితర ప్రాంతాల్లో ఇండియన్ మార్టులు కిటకిటలాడాయి. అందరూ ఒకేసారి బియ్యం (Rice) కోసం పోటెత్తడంతో ధరలు కూడా అదే స్థాయిలో దూసుకుపోయాయి. సాధారణంగా 25 డాలర్లు […]

Fight For Rice In USA
విధాత: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో.. విదేశాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రవాసులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికా (America) లో ఈ నిషేధం ప్రభావం ఎక్కువగా కనపించింది. ఇక్కడ భారతీయులు ఎక్కువగా ఉండే బే ఏరియా, న్యూజెర్సీ, డల్లాస్ తదితర ప్రాంతాల్లో ఇండియన్ మార్టులు కిటకిటలాడాయి. అందరూ ఒకేసారి బియ్యం (Rice) కోసం పోటెత్తడంతో ధరలు కూడా అదే స్థాయిలో దూసుకుపోయాయి. సాధారణంగా 25 డాలర్లు ఉండే 10 కేజీల బియ్యం ధర ఇప్పుడు 50 డాలర్లకు అమ్ముడుపోతోంది. దుకాణదారులు ఒకరికి ఒక ప్యాకెట్టు మాత్రమే అందిస్తామని నిబంధన విధించడంతో చాలా మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ప్రభావంతో కొన్ని స్టోర్లలో ర్యాక్‌లపైకి ఎక్కి సామాన్లు కిందకి తోసేయడం, తోపులాటలు, చోటుచేసుకున్నాయి.
ఒక రకంగా బియ్యం కోసం అమెరికా స్టోర్లలో ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కొంత మంది అనవసర భయాలకు పోయి ఎక్కువ మొత్తంలో కొనేస్తుండటంతో గందరగోళం ఏర్పడుతోంది. దీంతో ఇప్పటికే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు సైతం పెట్టేశారు. అప్పుడే దీనిపైన మీమ్‌లు, ట్రోల్ వీడియోలు రూపొందుతున్నాయి. అమెరికాలోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అయితే ఏకంగా ఇల్లు కొంటే 15 సోనా మసూరి రైస్ బ్యాగ్‌లు ఇస్తామని ప్రకటించింది.
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ధరలను నియంత్రించడానికి బాస్మతీయేతర బియ్యంపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే మన నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో బాస్మతీ, ఉప్పుడు బియ్యందే సింహవాటా. ప్రస్తుతం భారత ప్రభుత్వం నిషేధించిన బియ్యం మన ఎగుమతుల్లో 25 శాతానికి మించదు.