Australia | ఆస్ట్రేలియాలో అగ్ని ప్ర‌మాదం.. అయిదుగురు కుమారులు స‌హా తండ్రి మృతి

Australia | ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జ‌రిగింది. ఇల్లు అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు కుమారులు.. వారి తండ్రి దుర్మ‌ర‌ణం చెందారు. ఇక్క‌డి ర‌సెల్ ద్వీపంలో ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతిక‌ర‌మైన ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించారు. ఈ ప్ర‌మాదం (Fire Accident) నుంచి బ‌య‌ట‌ప‌డిన ఒక మ‌హిళ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. చ‌నిపోయిన పిల్ల‌ల వ‌య‌సు 11, 10, నాలుగేళ్ల ఇద్ద‌రు క‌వ‌ల‌లు, 3 ఏళ్ల […]

  • By: krs    latest    Aug 06, 2023 7:47 AM IST
Australia | ఆస్ట్రేలియాలో అగ్ని ప్ర‌మాదం.. అయిదుగురు కుమారులు స‌హా తండ్రి మృతి

Australia |

ఆస్ట్రేలియా (Australia) లో ఘోరం జ‌రిగింది. ఇల్లు అగ్నికి ఆహుతైన ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు కుమారులు.. వారి తండ్రి దుర్మ‌ర‌ణం చెందారు. ఇక్క‌డి ర‌సెల్ ద్వీపంలో ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతిక‌ర‌మైన ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించారు.

ఈ ప్ర‌మాదం (Fire Accident) నుంచి బ‌య‌ట‌ప‌డిన ఒక మ‌హిళ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు. చ‌నిపోయిన పిల్ల‌ల వ‌య‌సు 11, 10, నాలుగేళ్ల ఇద్ద‌రు క‌వ‌ల‌లు, 3 ఏళ్ల బాలుడు ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక ఇల్లు పూర్తిగా నేల‌మ‌ట్టం కాగా మ‌రో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి.

అయితే ఈ ఘోర ప్ర‌మాదానికి కార‌ణాలు పూర్తిగా తెలియ‌రాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ద‌ర్యాప్తు ప్ర‌కారం. కుట్ర‌పూరితంగా ఏమీ క‌నిపించ‌లేద‌ని పోలీసులు తెలిపారు.