Kodali Nani | మళ్ళీ కేబినెట్‌లోకి ఫైర్ బ్రాండ్.. కొడాలి
విధాత: సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan reddy) తన కేబినెట్‌ను మరోసారి విస్తరిస్తున్నారు. రాజకీయ వేడి పెరగడం.. ఎన్నికలు సమీపిస్తుండడం, అటు టీడీపీ తన దాడిని పెంచడం.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలు తినడం వంటి పరిణామాలు జగన్‌ను డిస్టర్బ్ చేసాయి అంటున్నారు. ఈ క్రమంలో కేబినెట్‌లో దమ్మున్న వాళ్ళు, టీడీపీని గట్టిగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటె మంచిదన్న భావనలో ఉన్న జగన్ ఇప్పుడు గట్టి వాయిస్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే […]

విధాత: సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jaganmohan reddy) తన కేబినెట్‌ను మరోసారి విస్తరిస్తున్నారు. రాజకీయ వేడి పెరగడం.. ఎన్నికలు సమీపిస్తుండడం, అటు టీడీపీ తన దాడిని పెంచడం.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలు తినడం వంటి పరిణామాలు జగన్‌ను డిస్టర్బ్ చేసాయి అంటున్నారు.
ఈ క్రమంలో కేబినెట్‌లో దమ్మున్న వాళ్ళు, టీడీపీని గట్టిగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటె మంచిదన్న భావనలో ఉన్న జగన్ ఇప్పుడు గట్టి వాయిస్ కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరిని కేబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది.
దీని కోసమే నిన్న గవర్నర్‌ను కలిసి తన ఆలోచన చెప్పి, ఆయన ఆమోదం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కోడలి నాని (Kodali Nani )ని మళ్ళీ కేబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఆయన ఉంటె ఆయన టీడీపీ మీద దూకుడుగా ఉంటారని, వారి విమర్శలకు సరిగా సమాధానం ఇస్తారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇంకా ఆయనతో పాటు ఒంగోలు జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సైతం కేబినెట్‌లోకి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. జగన్ ప్రభుత్వం 2019 మేలో ఏర్పడగా అప్పుడు కొందరు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు.
ఆతరువాత గత ఏడాది ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని రెండో సారి విస్తరించిన సీఎం జగన్.. దీనిని ఎన్నికల మంత్రివర్గంగా పేర్కొన్నారు. ఆ క్రమంలో శ్రీవాణి, కొడాలి, పేర్ని నాని , కన్నబాబు , సుచరిత వంటి కొందరు పదవులు కోల్పోయారు.
అయితే.. అప్పుడు మంత్రివర్గంలోకి వచ్చినవారు ఆశించిన విధంగా పనిచేయడం లేదు. దీంతో మరోసారి మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లోనే కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకుంటారని అంటున్నారు. ఇప్పుడు కొత్త మంత్రుల సారధ్యంలో జగన్ ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.