Delhi | సోనియా గాంధీ క్యాంపులో మంట‌లు..

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని స‌మ‌ల్కా కప‌షేరాలో నిన్న రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. క‌ప‌షేరాలోని సోనియా గాంధీ క్యాంపు( Sonia Gandhi Camp )లో ఉన్న క‌ల‌ప గోదాములో రాత్రి 9:38 గంట‌ల‌కు మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన గోదాము సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న 16 ఫైరింజ‌న్లు గంట‌ల పాటు శ్ర‌మించి, మంట‌ల‌ను అదుపు చేశాయి. ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. దీంతో గోదాము య‌జ‌మాని, పోలీసులు ఊపిరి […]

Delhi | సోనియా గాంధీ క్యాంపులో మంట‌లు..

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని స‌మ‌ల్కా కప‌షేరాలో నిన్న రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. క‌ప‌షేరాలోని సోనియా గాంధీ క్యాంపు( Sonia Gandhi Camp )లో ఉన్న క‌ల‌ప గోదాములో రాత్రి 9:38 గంట‌ల‌కు మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన గోదాము సిబ్బంది అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించింది.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న 16 ఫైరింజ‌న్లు గంట‌ల పాటు శ్ర‌మించి, మంట‌ల‌ను అదుపు చేశాయి. ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. దీంతో గోదాము య‌జ‌మాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. అయితే అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.