Nalgonda: నకిరేకల్ ప్రభుత్వాసుపత్రి ఆపరేషన్ థియేటర్ దగ్ధం.. విచారణ చేపట్టిన పోలీసులు
విధాత: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు థియేటర్లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. మంటలు అధికమై ఇవి పేలి ఉంటే ఒత్తిడి ధాటికి పాతబడిన ఆసుపత్రి భవనానికి ముప్పు వాటిల్లి ఉండేది. ఆపరేషన్ థియేటర్‌కు సమీపంలోనే వెటర్నరీ, పురుషుల వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో 25 […]

విధాత: నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగినపుడు థియేటర్లో రెండు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. మంటలు అధికమై ఇవి పేలి ఉంటే ఒత్తిడి ధాటికి పాతబడిన ఆసుపత్రి భవనానికి ముప్పు వాటిల్లి ఉండేది. ఆపరేషన్ థియేటర్‌కు సమీపంలోనే వెటర్నరీ, పురుషుల వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో 25 మందికి పైగా రోగులు ఇన్ పేషెంట్లు ఉన్నారు. రాత్రి 12 గంటల వరకు ఆపరేషన్ థియేటర్లో డెలివరీ ఆపరేషన్లు జరిగాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.జి. శ్రీనాథనాయుడు తెలిపారు.
2.30 గంటల సమయంలో థియేటర్లో మంటలు వస్తున్నాయని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి ఆర్పేందుకు చర్యలు చేపట్టామన్నారు. థియేటర్ వెనుక వైపు కిటికీ అద్దాలు పగులగొట్టి ఎండు గడ్డి, కాగితాలను లోపల వేసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన గుర్తులున్నాయన్నారు. ఈ ఘటనలో ఏసీ యంత్రం, బాయిల్ ఆపరేటర్ యూనిట్, నాలుగు సెట్ల శస్త్రచికిత్సల పరికరాలు, బీపీ ఆపరేటర్ కాలిపోయాయి.
2 లక్షల వరకు ఆస్తి నష్టమైందని అంచనా వేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని సూపరింటెండెంట్ శ్రీనాథ్ నాయుడు తెలిపారు. డాక్టర్లు డీసీహెచ్ఎస్ డా.డి. మాతృ, సీఐ రాఘవరావు, ఎస్సై గోపికృష్ణ సందర్శించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.