Delhi | లాయ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్.. ఢిల్లీ కోర్టు ప‌రిస‌రాల్లో కాల్పులు

Delhi విధాత‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. ఢిల్లీలోని తీస్ హ‌జారీ కోర్టు కాంప్లెక్స్ ప‌రిస‌రాల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల ఘ‌ట‌న కంటే ముందు రెండు వ‌ర్గాల‌కు చెందిన లాయ‌ర్ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో ఓ వ‌ర్గానికి చెందిన లాయ‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రిపి, అవ‌త‌లి వ‌ర్గానికి చెందిన లాయ‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఈ కాల్పుల్లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు […]

  • By: Somu    latest    Jul 05, 2023 10:07 AM IST
Delhi | లాయ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్.. ఢిల్లీ కోర్టు ప‌రిస‌రాల్లో కాల్పులు

Delhi

విధాత‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. ఢిల్లీలోని తీస్ హ‌జారీ కోర్టు కాంప్లెక్స్ ప‌రిస‌రాల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల ఘ‌ట‌న కంటే ముందు రెండు వ‌ర్గాల‌కు చెందిన లాయ‌ర్ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో ఓ వ‌ర్గానికి చెందిన లాయ‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రిపి, అవ‌త‌లి వ‌ర్గానికి చెందిన లాయ‌ర్ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఈ కాల్పుల్లో ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ కాల్పుల ఘ‌ట‌న‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మ‌న్ కేకే మ‌నాన్ స్పందించారు. లాయ‌ర్ గాల్లోకి కాల్పులు జ‌రప‌డాన్ని మ‌నాన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి స్థాయి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. లాయ‌ర్ కాల్పులు జ‌రిపిన తుపాకీకి లైసెన్స్ ఉందా లేదా అన్న కోణంలో విచార‌ణ జ‌రుగుతుంద‌న్నారు. ఒక‌వేళ ఆ ఆయుధాల‌కు లైసెన్స్ ఉన్నా.. వాటిని కోర్టు ప‌రిస‌రాల్లో వాడ‌డం నేరం అవుతుంద‌ని బార్ కౌన్సిల్ చైర్మెన్ స్ప‌ష్టం చేశారు.