బీఆరెస్ పరిస్థితి దిగజారుతుంది.. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆడియో వైరల్‌

తాజాగా బీఆరెస్ నుంచి బీజేపీలో చేరిన హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది

బీఆరెస్ పరిస్థితి దిగజారుతుంది.. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆడియో వైరల్‌

టికెట్ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకున్నారు

రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్తు

రేవంత్ రెడ్డిని దింపాలని ఆ పార్టీ నేతలే చూస్తున్నారు

పార్టీ మారినందుకు క్షమించాలి

కేంద్రంలో వచ్చేది మోదీ ప్రభుత్వమే

విధాత : తాజాగా బీఆరెస్ నుంచి బీజేపీలో చేరిన హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. అడియోలో సైదిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ రావాలని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని, అక్కడికి వెళ్లాక నల్లగొండ పార్లమెంట్ టికెట్ నీకే ఇస్తారని చెప్పి, పెద్దల సమక్షంలో కండువా కప్పుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. అయితే తాను ఎవరికీ చెప్పకుండా ఢిల్లీకి వచ్చానని మావాళ్లతో మాట్లాడి చేరుతానని చెప్పినా వినకుండా…ఇప్పుడు చేరకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని, సీతారాంనాయక్, జలగం వెంకట్రావులు కూడా ఉన్నారని బలవంతం చేసి పార్టీలో చేర్చుకున్నారని వెల్లడించారు. తాను అకస్మాత్తుగా పార్టీ మారినందుకు తనపై కార్యకర్తలకు, అనుచరులకు కోపం ఉందని, అలాంటి వారంతా రాజకీయ పరిస్థితులను అర్దం చేసుకుని తనను క్షమించాలని కోరారు. మీరందరూ నా వెంట ఉంటారని నేను వెళ్లానని, మీరు లేకపోతే నేను ఒక్కడిని పోయి ఏం చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేగాక కొందరు ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటారని మాట్లాడుతున్నారని, నేను లోకల్ అని పనిచశానే తప్ప కులం, మతం పార్టీ చూడలేదన్నారు. నేను చెప్పకుండా పోయినందుకు కొందరు ఆవేశంతో పోస్టులు పెడుతున్నారని, అందుకు నన్ను క్షమించాలని, నేను ఒక్కడిని పోతే విలువ ఉండడని, మీరు నా వెంట రావాలని కోరుకుంటున్నానని, త్వరలోనే మీటింగ్ పెడతానని.. నా వెంటే నడవాలని ఆడియోకో కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనకు డబ్బులివ్వకుండా ఆవతలి వాళ్లకు డబ్బులిస్తే మనం ఎట్లా గెలుస్తం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని కొందరు మాట్లాడుతున్నారని, నేను బీఆరెస్‌లో చేరినప్పుడు ఒక్క సర్పంచ్ లేడని, నేను వచ్చాక 120 సర్పంచ్ లు, 17 పీఏసీఎస్ లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిపించున్నామని సైదిరెడ్డి ఏకరవు పెట్టారు. కానీ నేను ఉన్న సమయంలో యువతకు న్యాయం చేయడంలో ఫెయిల్ అయ్యానని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ మోదీనే వస్తారని, అప్పుడు స్కిల్ డెవలెస్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చని అలోచించానన్నారు. దేశంలో మోదీ తుఫాన్ వీస్తుందని, రామాలయం కూడా నిర్మించారని, చరిత్రలో ఇంత క్లీన్ ఉన్న నాయకులు లేరని, దేశంలో ఒక్క స్కాం కూడా జరగలేదని, మోడీకి కుటుంబం కూడా లేదని, దేశమే అయన కుటుంబం అని ఆయన సపోర్టు ఉంటే మంచిదనే ఉద్దేశంతో పార్టీ మారనని సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆరెస్‌ నుంచి చాలా మంది వెళ్లిపోయారని, ఎంపీగా పోటీ చేయడానికి కూడా భయపడిపోతున్నారని, పైళ్ల శేఖర్‌రెడ్డి, రంజిరెడ్డిలు ఎంపీలుగా పోటీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డిని దించేయాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీఆరెస్ బలహీన పడుతుందని, బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 12ఎంపీ సీట్లు గెలిచే అవకాశముందని భావిస్తున్నట్లుగా చెప్పారు.