ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం కేఏ పాల్ సమక్షంలో బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు

విధాత, హైదరాబాద్ : ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. సోమవారం కేఏ పాల్ సమక్షంలో బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు పాల్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాబుమోహన్ వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు బాబు మోహన్‌కు కేఏ పాల్ టికెట్ విషయమై హామీ ఇచ్చినట్లుగా సమాచారం. బాబుమోహన్ గతంలో బీఆరెస్, బీజేపీలలో పనిచేయగా, తాజాగా ప్రజాశాంతి పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది.