Ramesh Rathore | డబుల్ బెడ్ రూమ్ పేరుతో బీఆరెస్ మోసం: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్
Ramesh Rathore కలెక్టరేట్ ముందు ధర్నా విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో పేదలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దోచుకోవడం పై ఉన్న శ్రద్ధ పేద […]

Ramesh Rathore
- కలెక్టరేట్ ముందు ధర్నా
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో పేదలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సంఘీభావం తెలిపి మాట్లాడారు.
సీఎం కేసీఆర్‌కు దోచుకోవడం పై ఉన్న శ్రద్ధ పేద ప్రజల పై లేదన్నారు. గత 9 సంవత్సరాలలో ఒకరికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు అందించకుండా పేద ప్రజలను మోసం చేశారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస యోజన ద్వారా వస్తున్న రాష్ట్ర ప్రజలకు రాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన పేద ప్రజలకు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తామన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ 4 నెలల్లో, ఎమ్మెల్యే దివాకర్ రావు క్యాంప్ ఆఫీస్ 6 నెలల్లో పూర్తి చేసుకున్నారు కానీ పేద ప్రజలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించలేదన్నారు.
గత 6 నెలల క్రితం లాటరీ ద్వారా ఎంపిక చేసిన 330 మందికి ఇప్పటి వరకు ఎందుకు ఇల్లు కేటాయించలేదని ప్రశ్నించారు. లాటరీ ద్వారా ఎంపిక అయిన వారిలో నిజమైన అర్హులను గుర్తించి నెల రోజుల్లో ఇల్లు కేటాయించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
గతంలో కాంగ్రెస ప్రభుత్వం హయాంలో పేదలకు చెల్లని పట్టాలు ఇచ్చి పేద ప్రజలను మోసం చేసిన ఘనత ప్రేమ్ సాగర్ రావు దే అని అన్నారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్ ,బీఆరెస్ ప్రభుత్వాలలో మోస పోయారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.