Colombia | ఈ న‌లుగురు చిన్నారులు.. మృత్యుంజ‌యులు

Colombia మే 1న కొలంబియాలోని అడ‌విలో కూలిన విమానం ఐదువారాల త‌ర్వాత ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వైనం రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన జాగిలాలు విధాత‌: కొలంబియా (Colombia) అడ‌వుల్లో కూలిపోయిన ఒక ప్రైవేట్ జెట్ (Jet) ఘ‌ట‌న‌లో.. అందులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు చిన్నారుల ఆచూకీ ఐదు వారాల త‌ర్వాత తెలిసింది. వీరి ఆచూకీ కోసం ఆ దేశం మొత్తం ఇన్ని రోజులూ ఊపిరిబిగ‌ప‌ట్టుకుని ఎదురుచూసింది. విమానం కూలిపోయిన చోటుకు ద‌గ్గ‌ర్లోనే చిన్నారులు క‌నిపించార‌ని రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు […]

  • By: krs    latest    Jun 10, 2023 3:45 PM IST
Colombia | ఈ న‌లుగురు చిన్నారులు.. మృత్యుంజ‌యులు

Colombia

  • మే 1న కొలంబియాలోని అడ‌విలో కూలిన విమానం
  • ఐదువారాల త‌ర్వాత ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన వైనం
  • రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన జాగిలాలు

విధాత‌: కొలంబియా (Colombia) అడ‌వుల్లో కూలిపోయిన ఒక ప్రైవేట్ జెట్ (Jet) ఘ‌ట‌న‌లో.. అందులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు చిన్నారుల ఆచూకీ ఐదు వారాల త‌ర్వాత తెలిసింది. వీరి ఆచూకీ కోసం ఆ దేశం మొత్తం ఇన్ని రోజులూ ఊపిరిబిగ‌ప‌ట్టుకుని ఎదురుచూసింది. విమానం కూలిపోయిన చోటుకు ద‌గ్గ‌ర్లోనే చిన్నారులు క‌నిపించార‌ని రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు (Rescue Operation) నేతృత్వం వ‌హించిన ఆర్మీ అధికారులు శుక్ర‌వారం వెల్ల‌డించారు.

ఇదీ ప్ర‌మాదం జ‌రిగిన తీరు

సెస్నా 206 అనే చిన్న విమానం ఏడుగురు ప్ర‌యాణికుల‌తో అరారాక్వారా అనే ప్రాంతం నుంచి మే 1న బ‌య‌లుదేరింది. స‌రిగ్గా అమెజాన్ అడ‌వుల (Amazon Forest) పైకి వ‌చ్చేట‌ప్ప‌టికి ఇంజిన్ విఫ‌ల‌మైంద‌ని కాసేప‌ట్లో కూలిపోతున్నామ‌ని ఏటీసీకి స‌మాచారం ఇచ్చింది. భ‌ద్ర‌తా సిబ్బంది అక్క‌డికి చేరుకునే స‌రికి ఘ‌ట‌నా స్థ‌లంలో పైలెట్‌, చిన్నారుల త‌ల్లి, మ‌రో వ్య‌క్తి మృత‌దేహాలు మాత్ర‌మే క‌నిపించాయి.

అందులోనే ప్ర‌యాణించిన న‌లుగురు చిన్నారులు అక్క‌డ క‌నిపించ‌లేదు. వీరిని 13, 9, 4 ఏళ్ల వ‌యసున్న బాలిక‌లు ఒక సంవ‌త్స‌రం వ‌య‌సున్న బాలుడిగా అధికారులు గుర్తించారు. వెంట‌నే వీరి ఆచూకీ కోసం సైన్యం ప్ర‌త్యేక ఆప‌రేష‌న్‌ను ప్రారంభించింది.

ఐదు వారాల ముమ్మ‌ర గాలింపు అనంత‌రం తాజాగా ఆ చిన్నారులు దొర‌క‌డంతో కొలంబియా యావత్తు ఆనందంలో మునిగిపోయింది. దేశ అధ్య‌క్షుడు గుస్తావో పెట్రో సైతం ఒక ప్ర‌క‌ట‌న ద్వారా త‌న సంతోషాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. ఆ న‌లుగురితో క‌లిసి సైన్యం తీసుకున్న ఫొటో నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

జాగిలాల సాయంతో..

చిన్నారులు తిని ప‌డేసిన ఓ పండును వాసన చూసిన జాగిలాలు (Sniper Dogs).. వారి ఆచూకీని ప‌సిగట్టాయ‌ని రాయిట‌ర్స్ క‌థ‌నం పేర్కొంది. ఆ చుట్టుప‌క్క‌ల విమానాలు, హెలికాప్ట‌ర్‌ల‌తో అణువ‌ణువూ జ‌ల్లెడ‌ప‌ట్ట‌డంతో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ అద్భుతం సాధ్య‌ప‌డింది.

ప్ర‌స్తుతం చిన్నారులు చాలా బ‌ల‌హీనంగా ఉన్నార‌ని, వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వారిని ఉంచిన‌ట్లు శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో అధ్య‌క్షుడు పేర్కొన్నారు.