Viral Video |దారుణం: వ్యక్తిపై.. నాలుగు పులులు ముప్పేట దాడి!
Viral Video | పులుల పేరు వినగానే మనషుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటి పెద్ద పులుల మధ్య పంజరంలో పావురం చిక్కుకున్నట్లు.. ఓ వ్యక్తి చిక్కుకు పోయాడు. ఒక పులి కాదు.. ఏకంగా నాలుగు పులులు అతన్ని చుట్టుముట్టాయి. ఆ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లక్కట్‌కోట్ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. లక్కట్‌కోట్ అటవీ ప్రాంతానికి సమీపంలోని […]

Viral Video | పులుల పేరు వినగానే మనషుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. శరీరమంతా చెమటలు పట్టేస్తాయి. అలాంటి పెద్ద పులుల మధ్య పంజరంలో పావురం చిక్కుకున్నట్లు.. ఓ వ్యక్తి చిక్కుకు పోయాడు. ఒక పులి కాదు.. ఏకంగా నాలుగు పులులు అతన్ని చుట్టుముట్టాయి. ఆ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లక్కట్‌కోట్ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. లక్కట్‌కోట్ అటవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి పంట పొలాల్లోకి వెళ్లాడు. అయితే పులులు అక్కడున్న చెట్ల పొదల్లో దాగి ఉన్నాయి. వ్యక్తిని గమనించిన పులులు ఒక్కసారిగా దాడి చేశాయి. అతని పీకను పట్టేశాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని, పులులపై కాల్పులు జరిపారు.
Viral Video |దారుణం: వ్యక్తిపై.. నాలుగు పులులు ముప్పేట దాడి! https://t.co/pHWVvKBBPL pic.twitter.com/eVPXgn7pmZ
— vidhaathanews (@vidhaathanews) December 6, 2022
దీంతో నాలుగు పులులు అతన్ని విడిచి చెట్ల పొదల్లోకి పరుగెత్తాయి. మళ్లీ ఓ పులి వచ్చి అతని గొంతును పట్టి కసితీరా దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కురసంఘీగా అధికారులు గుర్తించారు. పులుల దాడులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.