రైతుబంధు-రైతు బీమా కుంభకోణం.. ఏఈఓ మాయాజాలం

రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు

  • By: Somu    latest    Feb 26, 2024 11:11 AM IST
రైతుబంధు-రైతు బీమా కుంభకోణం.. ఏఈఓ మాయాజాలం

విధాత: రైతుబంధు, రైతుబీమా కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో) గోరేటి శ్రీశైలంతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఈవోతో పాటు క్యాబ్‌ డ్రైవర్‌ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి చెప్పారు. ఏఈవో శ్రీశైలం కొందుర్గ్‌ మండలంలోని కొన్ని గ్రామాలకు ఇంచార్జ్‌గా ఉన్నారని, రైతులు చనిపోయినట్లు ధ్రువపత్రాలు పెట్టి నిధులు మళ్లించుకున్నట్లు గుర్తించామన్నారు.


అమాయకులను అక్ష్యంగా చేసుకుని ఫేక్‌ డాక్యుమెట్లు తయారు చేస్తున్నారని తెలిపారు. చనిపోయిన వారి పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత నాలుగేండ్లుగా 20 మంది రైతుల పేరుతో రూ.2 కోట్లు కాజేశారని వెల్లడించారు. ఫోర్జరీ చేస్తున్నారని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు గుర్తించామన్నారు. ఒకే ఖాతాకు రైతుబంధు, రైతుబీమా నిధులు వెల్లడంతో అనుమానం వచ్చిన సంబంధిత శాఖ అధికారులు విచారించడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది.