బకాయిలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించండి: CM KCRకు ఉత్తమ్ లేఖ
విధాత: 2023- 24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రైతులకు, మహిళా సంఘాలకు, విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. వచ్చే బడ్జెట్లో వారికి చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట రుణాల కోసం 20వేల కోట్లు, స్వయం సహాయక మహిళా సంఘాలకు 4వేల కోట్లు, విద్యార్థులకు ఉపకార, ఫీజు రియింబర్స్ మెంట్ 3 వేల […]

విధాత: 2023- 24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రైతులకు, మహిళా సంఘాలకు, విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.
వచ్చే బడ్జెట్లో వారికి చెల్లించాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంట రుణాల కోసం 20వేల కోట్లు, స్వయం సహాయక మహిళా సంఘాలకు 4వేల కోట్లు, విద్యార్థులకు ఉపకార, ఫీజు రియింబర్స్ మెంట్ 3 వేల కోట్ల బకాయిల చెల్లింపు కు బడ్జెట్ లో నిధులు కేటాయించి రిలీజ్ చేయాలని ఉత్తమ్ తన లేఖలో సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.