Gaddar | ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి తూప్రాన్ బిడ్డ గద్దర్.. CM KCRపై పోటీ
Gaddar రాజకీయాల్లోకి గద్దర్ రె 'ఢీ' చెప్పకనే చెప్పిన గద్ధర్ ఇకపై సోంతుళ్లోనే గద్దర్ కేసీఆర్ పై పోటీకి గద్దర్ పావులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో గద్దర్ టచ్ కేసీఆర్ పాలనపై గత కొద్దిరోజులుగా గద్దర్ పరోక్ష విమర్శలు ప్రభుత్వ పాలన పై విసుగుతో రాజకీయాల్లోకి ? అన్ని పార్టీలతో మమేకం.. స్వతంత్రంగానా.. ఏ పార్టీ నుంచైనా? అన్ని పార్టీల ఐక్య అభ్యర్థిగా ప్రతిపాదన…? రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాల […]

Gaddar
- రాజకీయాల్లోకి గద్దర్ రె ‘ఢీ’
- చెప్పకనే చెప్పిన గద్ధర్
- ఇకపై సోంతుళ్లోనే గద్దర్
- కేసీఆర్ పై పోటీకి గద్దర్ పావులు
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో గద్దర్ టచ్
- కేసీఆర్ పాలనపై గత కొద్దిరోజులుగా గద్దర్ పరోక్ష విమర్శలు
- ప్రభుత్వ పాలన పై విసుగుతో రాజకీయాల్లోకి ?
- అన్ని పార్టీలతో మమేకం.. స్వతంత్రంగానా.. ఏ పార్టీ నుంచైనా?
- అన్ని పార్టీల ఐక్య అభ్యర్థిగా ప్రతిపాదన…?
- రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో ఆట పాటలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలు ఊగించి ఎంతోమంది యువతను విప్లవ రాజకీయాల వైపు విప్లవ పార్టీలవైపు ఆకర్షించిన గద్దర్ (Gaddar) బుల్లెట్ వైపు నుండి బ్యాలెట్ వైపు వస్తున్నారు.విప్లవ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తూఫాన్ రేపిన తూప్రాన్ బిడ్డ ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో కి అడుగు పెట్టనున్నారు.
ఈ మేరకు తాను తూప్రాన్ లోనే నివాసం ఉంటాను తనకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం తూప్రాన్ పోలీస్ లకు గద్దర్ వినతి పత్రం సమర్పించారు.దీంతో గద్దర్ గజ్వేల్ నియోజకవర్గం లోనే పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. వివరాలు ఇలా వున్నాయి.
రాజకీయ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానంటు ప్రకటించిన ప్రజాయుద్దనౌక గద్దర్. ఎన్నికలనే టార్గేట్‌గా పెట్టుకున్నారా ఆయన పొలిటికల్ ఎంట్రి ఎక్కడ నుండి ఉండబోతుంది. 2023లో గద్దర్ ఏ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తానని గద్దర చెప్పకనే చెప్పారు. తన ఆట పాట లతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్ ఎన్నికలకు సిద్దమంటు ప్రకటించారు.
అయితే ఎక్కడ నుండి పోటి చేస్తారనేది మాత్రం అప్పుడు చెప్పలేదు ఓ వైపు ముందస్తు సంకేతాలు మరోవైపు అన్ని పార్టీలు అభ్యర్దులను ఫైనల్ చేసుకుంటున్న ఈ తరుణంలో గద్దర్ కూడా తన పొలిటికల్ ఎంట్రీ పై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తన సొంత జీవితాన్ని గజ్వేల్ నియోజకవర్గం నుండి ఆయన కేసీఆర్ పై పోటీ చేస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దీనికి తోడు మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగళవారం పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు గద్దర్ తెలపడం మరో విశేషం.
పరిచయం అవసరం లేని వ్యక్తి
తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని చాల రాష్ట్రాలకు పరిచయం అవసరం లేని వ్యక్తి గద్దర్. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటు అడవి బాట పట్టి తన ఆట పాటలతో విప్లవ పంథాను కొనసాగించిన ప్రజా యుద్దనౌక. అణగారిన వర్గలను తన పాటతో చైతన్యం తీసుకువచ్చి పోరుబాట పట్టించడమే కాదు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలక ప్రభుత్వాలను సైతం తన పాటతో వణింకించిన విప్లవ కారుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశం చేయడంలోను పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోవడం లోనూ గద్దర్ ప్రముఖ పాత్ర పోషించే వాడని నిఘా వర్గలు సైతం అనేక సార్లు వెల్లడించడంతో గద్దర్ కరుడుగట్టిన కమ్యూనిస్టుగా ముద్ర పడ్డారు. అలాంటి గద్దర్ మారుతున్న పరిణామాలతో మావోయిస్టు పార్టీకి దూరం అయి ప్రజా క్షేత్రంలో ప్రత్యేక పోరాటాలను కొనసాగిస్తు తన ఆట పాటలతో పాలక ప్రభుత్వాలను నిలదీస్తునే వస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో చాల వేదికల పై గద్దర్ తన గొంతుకతో లక్షల మందిని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించిన ఘనత ఉంది. గతంలో రాజకీయంగా గద్దర్ కు చాల అవకాశాలు వచ్చినప్పటికి కారణాంతరాలవల్ల ఎన్నికలకు దూరంగా ఉంటు వచ్చారు. తాను నమ్మిన సిద్దాంతానికి వ్యతిరేకమనే భావన వల్లనే గద్దర్ ఇన్నాళ్లూ ఎన్నికల్లో పోటి చేయడానికి ఆసక్తి చూపనట్లు తెలిసింది.
ప్రజా సమస్యలపై గళమెత్తిన గాయకుడు
1997 ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ఆయన నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గద్దర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు ఆయన ఛాతిలోకి దూసుకెళ్లాయి. అందులో ఓ బుల్లెట్ మాత్రం ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉనట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలపడంతో ఆ బుల్లెట్‌ను శరీరంలోనే విడిచిపెట్టారు.
అయితే గద్దర్ మాత్రం ఇప్పటికీ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. తన పాటలతో అవినీతిని నిలదీస్తున్నారు. తూప్రాన్‌లో ఏకంగా విలేకరుల సమావేశంలో రాజకీయాల్లోకి నేను వస్తున్నట్లు ప్రకటించడంతో గద్దర్ అంశం చర్చనీయాంశంగా మారింది.
అందరితో టచ్‌లో ఉన్న గద్దర్
మసమాజ స్థాపనకు తాను ఎంచుకున్న విప్లవ రాజకీయాల్లో ఐదు దశాబ్దాలకు పైగా కీలక భూమిక నిర్వహించిన ప్రజాగాయకుడు ఇటీవల వాటికీ కొంత దూరంగా ఉంటున్నారు . భద్రాచలం రామాలయాన్ని సందర్శించడం …హైద్రాబాద్ లో చిన్న జీయర్ స్వామి ఆధ్వరంలో ఏర్పాటు చేసిన సమతా మూర్తి కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పడమే కాకుండా కేసీఆర్ పై పోటీకి సై అనడం సంచలనంగా మారింది.
సీఎల్పీ నేత భట్టికి గద్దర్ దగ్గరగా ఉంటాడని వినిపిస్తున్నాయి. భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్రలో కూడా గద్దర్ పాల్గొనడం దీనికి మరింత అజ్యాం పోస్తుంది. ఇటీవల మరోవైపు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ బిడ్డ అంటూ గద్దర్ ఆమెకు మద్దతు ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నినాదంతో షర్మిల తన పోరాటాన్ని మొదలుపెట్టారని పేర్కొన్నారు.
కొన్ని రోజులు ప్రభుత్వ విధానాలపై విమర్శలు
తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అందరూ భావిస్తే కేసీఆర్ పాలనలో ప్రజలకు కన్నీళ్లు మిగిలాయని గద్దర్ విమర్శలు గుప్పించారు. ఎంతో మంది అమరుల ఆత్మ బలిదానాలతో, తెలంగాణ ప్రజలు చిందించిన రక్తంతో గద్దెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించేలా యువత దీక్ష తీసుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
నిన్న మొన్నటి వరకు మంత్రులు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మంత్రులందరూ మన ముందే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత లైబ్రరీలలో వాడిపోయిన మొహాలతో ఎదురుచూస్తున్నారని గద్దర్ పేర్కొన్నారు. ఇలా ఎక్కడ ప్రభుత్వ విధానాలపై కార్యక్రమాలు జరిగిన పాల్గొంటూ ప్రభుత్వం గద్దర్(Gaddar) విమర్శలు చేస్తూ ఉన్నారు.
కేసీఆర్‌పై పోటీకి సిద్ధం
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగళవారం పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. తమ గ్రామంపై ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు.