Game Changer | మెగా పవర్‌స్టార్‌ బర్త్‌డే.. RC15, శంకర్‌ సినిమా టైటిల్‌ ప్రకటించిన మేకర్స్‌..!

Game Changer | మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది రామ్‌చరణ్‌కు 15వ సినిమా కావడం విశేషం. సినిమా అప్‌డేట్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా RC15 చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను విడుదల చేస్తూ బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్‌. సినిమాకు గేమ్‌ ఛేంజర్‌గా టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. […]

Game Changer | మెగా పవర్‌స్టార్‌ బర్త్‌డే.. RC15, శంకర్‌ సినిమా టైటిల్‌ ప్రకటించిన మేకర్స్‌..!

Game Changer | మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది రామ్‌చరణ్‌కు 15వ సినిమా కావడం విశేషం. సినిమా అప్‌డేట్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా RC15 చిత్రానికి సంబంధించిన టైటిల్‌ లోగోను విడుదల చేస్తూ బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్‌. సినిమాకు గేమ్‌ ఛేంజర్‌గా టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనున్నట్లు మూవీ టైటిల్‌ రివీల్‌ వీడియోనూ చూస్తే తెలిసిపోతున్నది.

చిత్రంలో రామ్‌చరణ్‌ ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. గేమ్‌ ఛేంజర్‌లో చెర్రీతో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ జతకట్టనున్నది. అలాగే తెలుగు హీరోయిన్‌ అంజలి సైతం మరో కథానాయికగా నటిస్తున్నది. శ్రీకాంత్, నవీన్ చంద్ర, దర్శకుడు ఎస్‌జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ దిల్‌ రాజు పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమాను నిర్మిస్తుండగా.. మ్యూజికల్‌ సెన్సేషన్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే సినిమా మెజారిటీ షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. మరో వైపు సినిమా పోస్టర్స్ లీక్‌ కాగా.. సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచాయి. రామ్‌చరణ్‌ చివరిసారిగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో సీతారామరాజుగా కనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంతో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా క్రేజ్‌ సంపాదించాడు.