మోడీ, షాల ఆట ముగిసిందా..?
ఉన్నమాట: మోడీ, షాల ఆట ముగిసిందా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. బీజేపీ బలం ఆర్ఎస్ఎస్ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి RSSతో ఎక్కువగా అనుబంధం, ఉన్న వాళ్ళకు, ఆ సంస్థ అండదండలు నేతలకు పార్టీలో ప్రాధాన్యం మోడీ షా కోటరీ తగ్గిస్తున్నది. బీజేపీ సిద్ధాంతానికి, ఆ పార్టీ భావజాలానికి విరుద్ధంగా మోడీ, షాల నిర్ణయాలు ఉంటున్నాయి. రెండు సార్లు ప్రజలు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టినా ఆ అవకాశాన్ని ఉపయోగిం చుకోలేదని ఆ పార్టీలో దశాబ్దాలుగా […]

ఉన్నమాట: మోడీ, షాల ఆట ముగిసిందా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. బీజేపీ బలం ఆర్ఎస్ఎస్ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి RSSతో ఎక్కువగా అనుబంధం, ఉన్న వాళ్ళకు, ఆ సంస్థ అండదండలు నేతలకు పార్టీలో ప్రాధాన్యం మోడీ షా కోటరీ తగ్గిస్తున్నది.
బీజేపీ సిద్ధాంతానికి, ఆ పార్టీ భావజాలానికి విరుద్ధంగా మోడీ, షాల నిర్ణయాలు ఉంటున్నాయి. రెండు సార్లు ప్రజలు భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టినా ఆ అవకాశాన్ని ఉపయోగిం చుకోలేదని ఆ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని సమాచారం.
నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ లాంటి వాళ్ళను పార్టీ పార్లమెంటరీ బోర్డు పదవుల నుంచి తప్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నదని అంటున్నారు. నాగ్‌పూర్‌కు దగ్గరగా ఉన్నవారి కంటే గుజరాత్ వాళ్లకు గులాములుగా ఉన్నవారికే పెద్ద పీట వేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు మోడీకి పోటీ ఎవరూ ఉండకూడ దనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎన్నికల కమిటీ కూర్పు అందుకు ఉదాహరణ అనే వాదనలు ఉన్నాయి. వాజపేయి మూడు సార్లు ప్రధానిగా పని చేసినప్పటికీ ఎన్నడూ వ్యక్తిగత పేరు, ఫొటోల కోసం పాకులాడలేదంటున్నారు.
ఆయన బీజేపీ నేతగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ సిద్ధాంతానికి కంకణబద్దుడు అయినప్పటికీ విపక్షాల ఆదరణ కూడా పొందిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ మోడీ,షాలు అలా కాదు పార్టీ కంటే వ్యక్తిగత ప్రచారమే మిన్న అన్నట్టు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
అందరి వికాసం అని నినదిస్తూ.. విద్వేష రాజకీయాలు చేస్తున్న వీరి వైఖరి వల్ల పార్టీ ప్రభ రోజురోజుకు తగ్గుతున్నదని, ప్రజలకు వీరిపై ఉన్న భ్రమలు తొలిగిపోతున్నయని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, మీడియా మేనేజ్మెంట్‌తో కాలం వెళ్లదీస్తున్న వీళ్లకు వచ్చే సార్వత్రిక ఎన్నికలు అంత ఈజీ కాదని చెబుతున్నారు.