గాంధీ ప్రతి మాట ఆచరణాత్మకమే : సీఎం కేసీఆర్
విధాత : స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ ప్రతి మాట ఆచరణాత్మకమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. మతం, కులం అనే తేడా లేకుండా అందరినీ స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించారు. అనేక సంస్కృతుల సమ్మేళనంగా స్వాతంత్య్ర సమరాన్ని సాగించారు. గాంధీ ఏం చేసినా కూడా అద్భుతమే, సందేశమే. గాంధీ ప్రతి […]

విధాత : స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ ప్రతి మాట ఆచరణాత్మకమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మతం, కులం అనే తేడా లేకుండా అందరినీ స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించారు. అనేక సంస్కృతుల సమ్మేళనంగా స్వాతంత్య్ర సమరాన్ని సాగించారు. గాంధీ ఏం చేసినా కూడా అద్భుతమే, సందేశమే. గాంధీ ప్రతి మాట ఆచరణాత్మకంగా ఉండేది. నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఆజాద్ లాంటి వారు గాంధీ నుంచి ప్రేరణ పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారు. వారి పోరాటం వల్లే ఇవాళ స్వేచ్ఛా వాయువులను అనుభవిస్తున్నాం.
భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలో 15 రోజుల పాటు గాంధీని గొప్పగా స్మరించుకున్నాం. మహాత్ముడి చిత్రాన్ని రాష్ట్రంలో ప్రదర్శన చేసుకున్నాం. 20 లక్షల మంది విద్యార్థులు వీక్షించారు. చాలా గొప్ప గొప్ప వాళ్లు మార్ఠిన్ లూథర్ కింగ్ లాంటి వారు గాంధీ మార్గాన్ని అనుసరించారు. గాంధీ నాకు ఆదర్శనీయుడని దలైలామా చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి మొదలుకుంటే మండేలా వరకు మహాత్ముడి సిద్ధాంతాన్ని అనుసరించారు. బరాక్ ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు.. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రసంగిస్తూ.. గాంధీ అనే వ్యక్తి ఈ భూగోళం మీద పుట్టి ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని ఒబామా స్వయంగా చెప్పారు. అంతటి గొప్ప వారు మహాత్ముడు అని కేసీఆర్ ప్రశంసించారు.